Sivasankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఇక లేరు!

  • November 28, 2021 / 08:40 PM IST

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శివ శంకర్ మాస్టర్ కు కరోనా నిర్ధారణ అయిందని ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. శివ శంకర్ మాస్టర్ కు కరోనా చికిత్స కోసం ధనుష్, చిరంజీవి ఆర్థిక సహాయం చేయగా సోనూ సూధ్ కూడా సోషల్ మీడియా వేదికగా శివ శంకర్ మాస్టర్ కు సహాయం చేస్తానని వెల్లడించారు.

అయితే చికిత్సకు కోలుకోలేక శివ శంకర్ మాస్టర్ మృతి చెందారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు మాస్టర్ ను కాపాడలేకపోయారని తెలుస్తోంది. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకుకు కరోనా సోకడంతో ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని సమాచారం. శివ శంకర్ మాస్టర్ మరణ వార్త తెలిసి ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. శివ శంకర్ మాస్టర్ మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పదికి పైగా భాషలలో వందల సంఖ్యలో సినిమాలకు శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. కొరియోగ్రాఫర్ గా తన ప్రతిభతో శివశంకర్ మాస్టర్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1975 సంవత్సరంలో అసిస్టెంట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శివ శంకర్ మాస్టర్ పదుల సంఖ్యలో సినిమాల్లో నటించారు. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు శివ శంకర్ మాస్టర్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus