సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు, పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. రోజూ ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు.సినీ పరిశ్రమకు చెందిన ఎవరొకరు అనారోగ్య సమస్యలతో లేదా వయసు సంబంధిత సమస్యలతో లేదా గుండెపోటుతో మరణిస్తుండటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే శరత్ బాబు, కన్నడ నటుడు నితిన్ గోపి, దర్శకుడు వెట్రిమారన్ అసిస్టెంట్ శరన్ రాజ్, మంగళ్ ధిల్లాన్ ,కొరియన్ నటి పార్క్ సూ రియాన్ , రాకేష్ మాస్టర్,మలయాళం సీనియర్ నటుడు పూజపుర రవి, సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వర రావు.. వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో కమెడియన్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘దిల్ సే బురా లగ్తా హై’ అనే ఒక్క డైలాగ్ తో ఇండియా మొత్తాన్ని నవ్వించి ఫేమస్ అయిపోయాడు దేవరాజ్ పటేల్. వినూత్న వీడియోలతో యూట్యూబ్ లో నిత్యం ట్రెండింగ్ లో నిలిచేవాడు. అలాగే పలు సినిమాల్లో, అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడిపేవాడు.
అలాంటి వ్యక్తి ఇటీవల షూటింగ్ ముగించుకుని రాయ్ పూర్ వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడట. ఈ క్రమంలో అతనికి బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. అతని మరణం పై విచారం వ్యక్తం చేస్తూ ఛత్తీస్ ఘడ్ సిఎం భూపేష్ బాఘేల్ ట్వీట్ చేయడం జరిగింది. దేవరాజ్ పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులతో పాటు అతని ఫాలోవర్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు.