క్రికెటర్స్ …. హీరోయిన్స్ తో ప్రేమలో పడటం, డేటింగ్ లు చేయడం వంటివి వినడానికి కొత్తేమీ కాదు. గతంలో సౌరవ్ గంగూలీ స్టార్ హీరోయిన్ నగ్మాతో ప్రేమాయణం నడిపాడు. ఈ విషయాన్ని నగ్మా కూడా ఓపెన్ గానే చెప్పింది. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నా… కుటుంబ పరిస్థితుల వల్ల పెళ్లిచేసుకోలేకపోయాం అని కూడా నగ్మా చెప్పుకొచ్చింది. ఇక కోహ్లీ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే హార్దిక్ పాండ్యా, రాహుల్ వంటి వారు బాలీవుడ్ హీరోయిన్ల వెంట పడుతున్నారు.
శ్రీయ కూడా ఒకప్పుడు క్రిస్ గేల్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. అనుపమ పరమేశ్వరన్, ప్రియాంక జవాల్కర్ వంటి భామలు కూడా క్రికెటర్ లతో ప్రేమాయణం నడుపుతున్నట్టు మొన్నామధ్య వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో ఇండియన్ క్రికెటర్ సౌత్ స్టార్ హీరోయిన్ మోజులో పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. నేషనల్ క్రష్ గా పిలవబడే రష్మిక పై ఓ ఇండియన్ క్రికెటర్ మోజు పెంచుకున్నాడని తెలుస్తుంది. అతను మరెవరో కాదు శుభ్ మన్ గిల్. 2019 లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇతను డబుల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు.
ఇతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘రష్మిక అంటే క్రష్ ఫీలింగ్’ అని తన మనసులో మాట బయటపెట్టాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే శుభ్ మన్ గిల్ .. ‘నేను ఈ విషయం ఎక్కడ చెప్పానో కూడా మర్చిపోయాను’ అంటూ వెంటనే మాట మార్చేసే ప్రయత్నం చేశాడు. ఇక రష్మిక .. ప్రస్తుతం ‘పుష్ప 2’ తో పాటు ‘యానిమల్’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!