మ్యూజిక్ డైరెక్టర్ కి దర్శకుడి వార్నింగ్!

  • February 23, 2024 / 11:06 AM IST

రధన్ టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. ఎక్కువగా మిడ్ రేంజ్ సినిమాలకే పనిచేసినా ఈయన ఖాతాలో మంచి హిట్లు ఉన్నాయి. మంచి మ్యూజిక్ అందిస్తాడు అనే పేరు కూడా సంపాదించుకున్నాడు. అందాల రాక్షసి, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, అర్జున్ రెడ్డి వంటి మ్యూజికల్ హిట్లు ఈయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఈయన గురించి ఓ దర్శకుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నిన్న ‘సిద్దార్థ్ రాయ్’ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.

ఈ క్రమంలో ఆ చిత్రం దర్శకుడు యశస్వి… రధన్ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ‘రధన్ వ‌ల్ల తెలుగు సినిమాలు కిల్ అవుతున్నాయి. మా సినిమాకి అతనే మ్యూజిక్ డైరెక్టర్. అవుట్ పుట్ విష‌యంలో ర‌ధ‌న్ నన్ను బాగా విసిగించాడు. ఇది కచ్చితంగా చెప్పాలి. త‌న‌తో చాలా విష‌యాల్లో అర్గ్యుమెంట్లు న‌డిచాయి. త‌ను మంచి టెక్నీషియ‌న్ అయితే అయ్యుండొచ్చు కానీ, త‌న సినిమాకి పాట‌లు, రీరికార్డింగ్ అందించే విషయాల్లో మాన‌సికంగా హింసించాడు.

చెన్నైలో ఉండి బ‌తికిపోయాడ‌ని, హైద‌రాబాద్ లో ఉంటే కచ్చితంగా గొడ‌వ‌లు అయ్యేవి, అలాంటి సంగీత ద‌ర్శ‌కుల‌తో దూరంగా ఉండాలి’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ టైంలో కూడా ర‌ధ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌ గురించి సందీప్ రెడ్డి వంగా ఫైర్ అయ్యాడు. ‘ర‌ధన్ (Radhan)  మంచి సంగీత దర్శకుడు. త‌న మెలోడీ బాగుంటుంది.

నేప‌థ్య సంగీతం కూడా కొత్త‌గా ఉండి. కానీ అనుకొన్న స‌మ‌యానికి అవుట్ పుట్ ఇవ్వ‌డు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో, ద‌ర్శ‌కుల్ని, నిర్మాత‌ల్ని ఇబ్బంది పెడతాడు. అందుకే.. టాలెంట్ ఉన్నా, స‌రైన అవ‌కాశాలు అందుకోలేక‌పోయాడు. ‘ఈ టైంలో సినిమా వదిలేస్తే ఏం చేస్తావు’ అని నన్ను బెదిరించాడు అంటూ సందీప్ కూడా చెప్పుకొచ్చాడు

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus