చిరు, పవన్, త్రివిక్రమ్ గొప్పదనం చెప్పిన డైరెక్టర్.. ఏం చెప్పారంటే?
February 13, 2024 / 02:48 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో జి.రామ్ ప్రసాద్ ఒకరు. ఈ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నాకు సపోర్ట్ గా ఉన్నవాళ్ల గురించి చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పాలని ఆయన అన్నారు. కలుస్తామని సరదాగా మాట్లాడుకుంటామని రామ్ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హోమ్ లోన్ అవసరమైతే త్రివిక్రమ్ వెంటనే సహాయం చేశారని ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం ఇప్పటికీ కుదరలేదని ఆయన తెలిపారు.
కరోనా సమయంలో ఆస్పత్రి బెడ్ విషయంలో త్రివిక్రమ్ చేసిన సహాయం మరవలేనని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. పవన్, త్రివిక్రమ్ నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని ఆయన పేర్కొన్నారు. నేను 20 రోజుల పాటు ఐసీయూలో ఉన్నానని రామ్ ప్రసాద్ కామెంట్లు చేశారు. నాకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరమైతే చిరంజీవి ద్వారా సహాయం అందిందని ఆయన వెల్లడించారు. చిరు, పవన్, త్రివిక్రమ్ వల్ల కరోనా సోకినా తాను కోలుకున్నానని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
నా కెరీర్ కోసం త్రివిక్రమ్ సహాయం చేసే ప్రయత్నం చేశారని కానీ కొన్ని కారణాల వల్ల వర్కౌట్ కాలేదని ఆయన తెలిపారు. త్రివిక్రమ్ చెప్పిన లైన్ కు మనం స్క్రిప్ట్ సిద్ధం చేయడం సులువు కాదని రామ్ ప్రసాద్ అన్నారు. జి.రామ్ ప్రసాద్ సినిమాల్లోకి దర్శకునిగా రీఎంట్రీ ఇచ్చి రాబోయే రోజుల్లో భారీ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
త్రివిక్రమ్ (Trivikram) స్నేహితులకు ఇంత ప్రాధాన్యత ఇస్తారని తెలిసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాతో సక్సెస్ సాధించి తర్వాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు. త్రివిక్రమ్ కు రాబోయే రోజుల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.