డైరెక్టర్ కోసం హోటల్ మొత్తం ఖాళీ!

  • January 9, 2023 / 04:33 PM IST

బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఫరాఖాన్ చాలా ఫన్నీగా ఉంటారు. ఈ విషయం ఆమెతో క్లోజ్ గా ఉన్నవాళ్లు చాలా మంది చెబుతుంటారు. ఇక సెటైర్లు వేయడంలో ఆమె తరువాతే ఎవరైనా. సోషల్ మీడియాలో ఫరాఖాన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు రోజూవారీ సంఘటనలపై కూడా స్పందిస్తుంటారు. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె హాలిడే ట్రిప్ లో భాగంగా జైపూర్ కి వెళ్లారు.

అక్కడ ఒక రెస్టారెంట్ లో తనకు లభించిన ట్రీట్మెంట్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫరాఖాన్ ప్రతి ఏడాది రాజస్థాన్ వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా రాజస్థాన్ లోని జైపూర్ కి వెళ్లి అక్కడ రాంబాగ్ ప్యాలెస్ లో బస చేశారు. అయితే ఫరాఖాన్ అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న హోటల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఫరాఖాన్ హోటల్ కి వెళ్లే సమయానికి హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. అలానే లైన్ లో నిల్చొని ఆమెకి స్వాగతం పలికారు.

దాంతో ఆశ్చర్యపోయిన ఫరాఖాన్ ఆ తరువాత కూపీ లాగడం మొదలుపెట్టారు. హోటల్ ఎందుకు ఖాళీగా ఉందని అక్కడ సిబ్బందిని అడిగారు. ‘మీ కోసమే ఇలా ఖాళీగా ఉంచామని’ సిబ్బందిలో ఒకరు సమాధానమిచ్చారు. ఆ తరువాత ఫరాఖాన్ నడుచుకుంటూ డైనింగ్ రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ కూడా అంతా ఖాళీగానే కనిపించింది.

విషయం అర్ధం చేసుకున్న ఫరాఖాన్.. ‘ఇలా డైనింగ్ హాల్ నాకోసం కేటాయించారా..? మరి బిల్లు ఎవరు కడతారు..?’ అంటూ సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈమె సినిమాలు తీయడంతో పాటు కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus