Star Director: స్వలింగ వివాహాలపై సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు!
April 18, 2023 / 07:22 PM IST
|Follow Us
స్వలింగ వివాహాలు అనేవి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. స్వలింగ వివాహాలు అంటే ఇద్దరూ స్త్రీలు లేదా ఇద్దరూ పురుషులు కలిసి చేసుకునే వావాహాలను స్వలింగ వివాహాం అని అంటారు. దీనిపై కోర్టులో కూడా ఫిటిషన్లు దాఖలైవ్వడం మనకు తెలిసిందే..అదే ఈ స్వలింగ వివాహం అనేది ‘అర్బన్ ఎలిటిస్ట్’ (తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే వ్యక్తుల) కాన్సెప్ట్ కాదని ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించడాన్ని తప్పుబడుతూ వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
స్వలింగ వివాహం అనే కాన్సెప్ట్ తప్పే కాదని (Star Director) ఆయన వాదించారు. దీన్ని ఇండియాలో సర్వసాధారణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ వివరణ కోరగా.. సోమవారం కేంద్ర తన వాదనను వినిపించింది. తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొందరు.. వారి అభిప్రాయాలను సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలను..
ప్రస్తుతమున్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాదించింది. ఈ వాదనను వివేక్ అగ్నిహోత్రి వ్యతిరేకించారు. అయితే, వివేక్ అగ్నిహోత్రి వాదనకు నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది వివేక్ వాదనను స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వివాహాలను అస్సలు ఇష్టపడనివారు ‘నోరు మూసుకో వివేక్’ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. .. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించి ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని గతంలోనూ కొందరు సెలబ్రిటీలు గొంతెత్తారు. బాలీవుడ్ ఫిలిం మేకర్ హన్సల్ మెహతా ఇప్పటికే స్వలింగ వివాహం కాన్సెప్ట్‌పై ‘మోడరన్ లవ్: ముంబై’ అనే ఆంథాలజీని రూపొందించారు. ఈయన కూడా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని ట్వీట్ చేశారు. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లను మంగళవారం నుంచి సుప్రీం కోర్టు విచారించనుంది.