సినీ నటీనటులతో తెలంగాణ విశిష్టత తెలిపిన డైరక్టర్లు!
December 21, 2017 / 11:03 AM IST
|Follow Us
కులం, మతం తేడా లేకుండా అందరూ జాలీగా జరుపుకునే పండుగ హోలీ. ఆకాశంలోని ఇంద్ర ధనుస్సును నేలమీదకు తెచ్చే ఈ పండుగ అంటే అందరికీ ఇష్టం. హోలీ విశిష్టతను తెలుపుతూ తెలుగు చిత్రాల్లో అనేక పాటలు వచ్చాయి. అయితే తెలంగాణ భాషతో నిండిన హోలీ పాట తొలిసారి రూపొందింది. తెలంగాణ యాస, భాష ఔన్యత్వం అందరికీ తెలిసేలా ఈ పాట సాహిత్యం ఉంది. “సీతాకోకల్లే మారె గల్లీలు”, “వారు వీరు అన్న కంచె తెంచెయ్ రోయ్”, “జన్మ ఒకటోరోయ్.. ఉన్న ఊపిరి ఒకటోరోయ్”.. అనే పద ప్రయోగాలు కొత్త అనుభూతిని అందించాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఈ పాటకి చిందులేయడంతో మరింత ఆకట్టుకుంటోంది.
హీరోయిన్ మెహ్రీన్ కూడా రంగుల్లో తడిసి ముద్దవడం కనులవిందుగా ఉంది. నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో రూపొందించిన ఈ హొలీ పాటను వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ప్రతి తెలంగాణ పండుగల్లో భాగం కావడం తధ్యమని సంగీతప్రియులు చెబుతున్నారు. మీరు కూడా ఆ పాటని విని, చూసి ఆనందించాలంటే.. ఈ లింక్ ని క్లిక్ చేస్తే చాలు..
బతుకమ్మ పాట
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటను కూడా అందించారు. ఈ పాటలో బుల్లితెర యాంకర్లు సుమ, ఝాన్సీ, ఉదయభానులతో పాటు వెండితెర క్యారక్టర్ ఆర్టిస్టులు నటించారు.
జై హో సాంగ్
తెలంగాణలో అనేకమంది కవులు ఉన్నారు. వారిని స్మరించుకుంటూ జై హో సాంగ్ ని హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఇందులో తెలుగు సినీ యువ హీరోలు వరుణ్ తేజ్, సునీల్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర, సాయి ధరమ్ తేజ్ లతో పాటు హీరోయిన్స్ కూడా నటించి.. తెలంగాణ కవుల గొప్పదనాన్ని వివరించారు.