Rajamouli: జక్కన్న వల్ల ఆ దర్శకుల కెరీర్ కు ప్రమాదమా..?

  • May 5, 2021 / 07:11 PM IST

బాహుబలి సిరీస్ సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేశారు. బాహుబలి సిరీస్ సినిమాల తరువాత పాన్ ఇండియా కథలనే రాజమౌళి తెరకెక్కిస్తూ తన సినిమాల్లో నటిస్తున్న హీరోలకు, ఇతర నటులకు కూడా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేలా చేస్తున్నారు. అయితే రాజమౌళి వల్ల కొంతమంది డైరెక్టర్లకు పరోక్షంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకున్న కొందరు డైరెక్టర్లు తెలుగు నేటివిటీ కథలతో విజయాలను సాధిస్తూ స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అయితే స్టార్ హీరోలంతా పాన్ ఇండియా కథల వైపు ఆసక్తి చూపుతుండటంతో ఈ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టార్ డైరెక్టర్ల భవిష్యత్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలు విజయం సాధిస్తే ఎటువంటి సమస్య లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఇప్పటివరకు తెచ్చుకున్న మంచి పేరును దర్శకులు పోగొట్టుకునే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతుండటంతో సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

కొంతమంది డైరెక్టర్లు రాజమౌళి వల్ల తమ కెరీర్ ప్రమాదంలో పడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళిలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతమంది డైరెక్టర్లు పాన్ ఇండియా డైరెక్టర్లుగా గుర్తింపును సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి మినహా ఐదు మందికి పైగా దర్శకులు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus