Reba Monica John: రెబ్బ మౌనిక జాన్ ఆ హీరో పై చేసిన వ్యాఖ్యలు వైరల్!

  • August 4, 2023 / 05:22 PM IST

హీరోయిన్ లేదా హీరో గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా సెలెక్ట్ అవ్వడం అంటే గొప్ప విజయం సాధించినట్టే. అయితే ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రతీ హీరోయిన్ కి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందా అంటే చెప్పలేం. కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది. ఆ కొంతమంది లో ఒకరే రెబ్బా మౌనిక జాన్. నిన్న మొన్నటి వరకు ఈమె పేరు కూడా ఎవ్వరూ విని ఉండరు.

రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిన్న సినిమా ‘సామజవరగమనా’ ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అటు అందం పరం గా , ఇటు అభినయం పరంగా ఆడియన్స్ దగ్గర నుండి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఈమెని ఈ చిత్రం లో చూడగానే నెటిజెన్స్ ఇంతకు ముందు ఈమె ఏదైనా సినిమాలో నటించిందా లేదా అని గూగుల్ లో వెతకడం ప్రారంభించారు.

ఆలా వెతకగా ఈమె గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఈమె ‘సమజవరగమనా’ కంటే ముందే మలయాళం లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘విజిల్’ లో యాసిడ్ బాధితురాలిగా నటించిన అమ్మాయి మరెవరో కాదు, ఈమెనే. అయితే ఈమె మలయాళం లో నటిస్తున్న రోజుల్లో ఒక ప్రముఖ స్టార్ హీరో ఈమెని డేటింగ్ కి రమ్మని పిలిచాడట.

ఈ విషయాన్నీ స్వయంగా రెబ్బ మౌనిక జాన్ (Reba Monica John) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అయితే మీడియా లో ఈ విషయం లీకై, రకరకాలుగా ఆ వార్త రూపాంతరం చెంది, మేమిద్దరం పిచ్చి పనులు చేస్తూ కెమెరాలకు దొరికిపోయామని పుకార్లు పుట్టించారు అంటూ రెబ్బా మౌనికా జాన్ చెప్పుకొచ్చింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus