అభిమానులకు గుడ్ న్యూస్.. బుల్లితెర నటుడి ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • March 17, 2023 / 08:54 PM IST

పేరెంట్స్ గా ప్రమోషన్ దొరకడం అనేది కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు. ఇలాగే ఓ నటుడికి కూడా ఆలస్యం అయ్యింది. అతనే మోహిత్ రైనా. 40 ఏళ్ల వయసులో ఈ నటుడు తండ్రయ్యాడు. అతని భార్య అదితి శర్మ శుక్రవారం నాడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం పూట ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మీ పుట్టినట్టు అని అంతా భావిస్తారు. అందుకే మోహిత్ కూడా తబ్బుబ్బైపోతున్నాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా మోహిత్ రైనా తన సోషల్ మీడియాలో తెలియజేసి తన ఆనందాన్ని చాటి చెప్పాడు.

‘ఇప్పుడే మేము ముగ్గురం అవ్వడం జరిగింది. మా పాపని ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నాం’ అంటూ రాసుకొచ్చి తన పాప చేతిని పట్టుకున్న ఫోటోని షేర్ చేశాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఫాలోవర్స్… మోహిత్ రైనాకి అలాగే అదితి శర్మ దంపతులకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. గత ఏడాది ఓ ప్రైవేట్ పార్టీలో కలిసిన మోహిత్, అదితి ల జంట… అటు తర్వాత ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది.

అయితే ప్రైవేట్ గా కాదు లెండి పెద్దల అంగీకారంతోనే.. వీరు పెళ్లి చేసుకున్నారు. ‘దేవోమ్ కా దేవ్ మహాదేవ్’ అనే టీవీ సిరీస్ తో మోహిత్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.అలాగే ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ మూవీలో మంచి పాత్రను పోషించి దేశవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక మోహిత్ రైనా తన పాప చెయ్యి పట్టుకుని తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus