ఇక నుండీ ఆ హీరో సినిమాలకు రివ్యూలు ఇవ్వను అంటున్న రైటర్..!
May 26, 2021 / 12:05 PM IST
|Follow Us
ఏ సినిమాకి అయినా రివ్యూలు అనేవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి.సినిమా బాగుంటే మంచి రివ్యూలు వస్తాయి. లేకుంటే నెగిటివ్ రివ్యూలు వస్తాయి. అయితే వీటి గురించి పెద్ద పెద్ద స్టార్ హీరోలు పట్టించుకోరు. అయితే మన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం ఏకంగా రివ్యూ రైటర్ పై కేసు వేశాడు.దీంతో ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..సల్మాన్ ఖాన్-ప్రభుదేవా కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం ఇటీవల.. అంటే మే 13న ఈద్ సందర్భంగా విడుదలైంది.ఓటిటి వేదికగా ఈ చిత్రం విడుదలైంది.
అందుబాటులో ఉన్న ఏరియాల్లో థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు. అయితే ‘రాధే’ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సల్మాన్ ఖాన్ అభిమానులు సైతం ఈ చిత్రం పై పెదవి విరిచారు. ఇదిలా ఉంటే ‘రాధే’ కి రివ్యూ ఇచ్చిన రైటర్ కమల్ ఖాన్ పై సల్మాన్ పరువు నష్టం దావా కేసు వేసాడు. సల్మాన్ ఖాన్ లీగల్ బృందం రైటర్ కమల్ ఖాన్కు సోమవారం నాడు లీగల్ నోటీసులు పంపిందట.ఈ విషయం పై రైటర్ కమల్ ఖాన్ ఓ ట్వీట్ ద్వారా స్పందిస్తూ …
” సల్మాన్ ఖాన్ ‘రాధే’ కు నేను రివ్యూ ఇచ్చినందుకు నా పై పరువు నష్టం దావా కేసు పెట్టారు! నేను చాలా సార్లు చెప్పాను, ఏ హీరో లేదా నిర్మాత సినిమాలకు అయినా నేను రివ్యూ ఇవ్వడం అభ్యంతరం అయితే నేను ఇవ్వను అని. కానీ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో నాపై పరువు నష్టం కేసు పెట్టాడు. నా రివ్యూ వల్ల ప్రేక్షకులు ప్రభావితమవుతారు అని అంత భయపడుతున్నాడా.? సరే.. ఇక నుండీ నేను అతని సినిమాలకు రివ్యూలు ఇవ్వను” అంటూ పేర్కొన్నాడు. ఇక గురువారం నాడు నగర సివిల్ కోర్టులో ఈ కేసు పై విచారణ జరగనుంది.