టాలీవుడ్ లో తనకంటూ పవర్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అగ్రనటుడు పవన్ కల్యాన్. మెగా స్టార్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా తన సొంత చరిష్మాతో అన్నయ్యను మించిన తమ్ముడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నటుడిగా, సింగర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా ఇలా ఎన్నో విభాగాల్లో సక్సెస్ ని చూసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే.
కానీ నిర్మాతగా మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయాడు. 2014 తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని స్థాపించాడు. ఈ బ్యానర్ మీద అప్పట్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా చెయ్యాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్. చేసి ఉంటే ఆయనకీ అప్పట్లోనే 70 కోట్ల రూపాయిల లాభం వచ్చేది. కానీ తనని నమ్మి సినిమా తీసిన బండ్ల గణేష్ తీన్మార్ చిత్రం తో భారీ ప్లాప్ అని అందుకున్నాడు అనే ఉద్దేశ్యం తో గబ్బర్ సింగ్ చిత్రాన్ని బండ్ల గణేష్ కి ఇచ్చేసాడు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మరియు ‘కాటమరాయుడు’ చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ ఫ్లాప్స్ గా నిల్చి పవన్ కళ్యాణ్ కి ఆర్థికంగా బాగా నష్టాలను కలిగించాయి. ఈ రెండు చిత్రాలు కాకుండా నితిన్ హీరో గా నటించిన ‘చల్ మోహన్ రంగ’ సినిమాకి పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించాడు. దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని కూడా పెట్టాడు.
యావరేజి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమాకి కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు.పెద్ద ఫ్లాప్ అవ్వడం తో 20 కోట్ల రూపాయిల నష్టం పవన్ కళ్యాణ్ కి వాటిల్లింది. ఈ సినిమా ఇచ్చిన స్ట్రోక్ కి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మించడం మానేసాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకడు. వచ్చిన డబ్బులను ఆయన రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నాడు.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!