కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ సినీ పరిశ్రమ తరఫున ‘పునీత్ నామన’ పేరుతో జ్ఞమగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు చాలా మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారంతా పునీత్ కి నివాళులు అర్పించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయనాయకులు రావడంతో అక్కడ బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించిన ఓ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురైంది. కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్న దర్శన్ ను లోపలకు వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డగించినట్లు సమాచారం.
ఈ సభకు దర్శన్ ఆలస్యంగా రావడంతో ఆయన్ను గేటు దగ్గర పోలీసులు ఆపినట్లు సమాచారం. ఆడిటోరియం ఫుల్ అయిపోవడంతో.. కూర్చోడానికి సీట్లు కూడా లేవని చెప్పి దర్శన్ ను బయటకు పంపేశారు. ఆ సమయంలో దర్శన్ తో పాటు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారట. చాలాసేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం కొందరు ఉన్నతాధికారులు వచ్చి దర్శన్ ను లోపలకు అనుమతించారట. లోపల కూర్చోడానికి సీట్లు లేకపోవడంతో ఆయన సెకండ్ క్లాస్ లో కాసేపు కూర్చున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత స్టేజ్ పై పునీత్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!