శృతి హాసన్ బాటలోనే ఆ స్టార్ హీరో కూడా..!

  • June 24, 2021 / 06:27 PM IST

ఎంతో మంది సినీ స్టార్లు మద్యానికి, డ్రగ్స్ కి బానిసలై పోయి తమ కెరీర్ ను నాశనం చేసుకుంటున్నట్టు గతంలో కథనాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఒత్తిడి వల్లనో లేక పార్టీ కల్చర్ కు అలవాటు పడిపోవడం వలనో తెలీదు కానీ… ఈ లిస్ట్ పెద్దదే అని ఆ కథనాల్లో రాసుకొచ్చారు విశ్లేషకులు.అయితే కొంతమంది ఈ అలవాట్ల నుండీ త్వరగానే బయట పడి తమ కెరీర్ ను చక్కబెట్టుకున్నట్టు కూడా వారు పేర్కొన్నారు. కొంతమంది అయితే బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించారు.

ఉదాహరణకు శృతి హాసన్ ను చెప్పుకోవచ్చు.గతంలో శృతి హాసన్ మద్యానికి బానిసై పోయినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే ఆరోగ్యం, జీవితం.. రెండు పాడవుతాయి అని త్వరగానే గ్రహించి వాటిని దూరం పెట్టినట్టు ఆమె తెలిపింది. ఇప్పుడు శృతి హాసన్ బాటలోనే తమిళ స్టార్ హీరో…శింబు కూడా నడుస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఈ స్టార్ హీరో కూడా గతంలో మద్యం సేవించనిదే.. నిద్రపోయేవాడు కాదట. అయితే ఏడాది నుండీ దానికి దూరమైనట్టు ఇతను చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు హెల్త్, ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్టు శింబు తెలిపాడు. గతంలో శింబు చాలా లావైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతను బాగా స్లిమ్ అయ్యి చాలా స్టైలిష్ గా తయారయ్యాడు. గతేడాది లాక్ డౌన్ ఏర్పడిన సమయం నుండీ శింబు మందు మానేసినట్టు చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus