2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
May 12, 2024 / 11:37 PM IST
|Follow Us
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొన్ని గంటలలో ప్రారంభం కాబోతున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లో అసలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో రెండు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావిడి నెలకొంది. ఇక సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి వెళ్లి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ (N .T. Rama Rao) తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎమ్మెల్యేగా ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. మరోవైపు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి టైర్ వన్ హీరోలు అందరూ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాజకీయాలలో కీలకపాత్ర వహిస్తున్నారు. చిరంజీవి (Chiranjeevi) ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఈయన పరోక్షంగా రాజకీయ వ్యవహారాలన్నింటిని నడిపిస్తున్నారు.
ఇక మెగా హీరోలందరూ కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) మద్దతుగా జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాల నిమిత్తం నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సిపి పార్టీకి ఈయన మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలు అందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాజకీయాలలోకి ఇన్వాల్వ్ అయ్యారు కానీ ముగ్గురు హీరోలు మాత్రం అసలు రాజకీయాల గురించి మాట్లాడలేదు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ (Prabhas) ఎన్టీఆర్ (Jr NTR) , మహేష్ బాబు (Mahesh Babu) ఈ ముగ్గురికి కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా రాజకీయాల గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఎవరికి సపోర్ట్ చేయకుండా మౌనంగా వారి సినిమాల పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.