Samantha: కొత్తింటి విషయంలో సమంత కండీషన్లు ఇవే!

  • April 1, 2022 / 10:50 PM IST

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు సినిమా ఆఫర్లు రావడం కష్టమని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. చైతన్యతో విడిపోయిన తర్వాత సమంతకు ఆఫర్లు మరింత ఎక్కువగా పెరిగాయి. ఒకవైపు సమంతకు ఆఫర్లు పెరుగుతుండగా మరోవైపు సమంత రెమ్యునరేషన్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. టాలెంట్ ఉన్న హీరోయిన్ కావడంతో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సైతం ఓకే చెబుతున్నారు.

Click Here To Watch NOW

ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా సమంతకు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. సమంతకు బాలీవుడ్ నుంచి భారీస్థాయిలో ఆఫర్లు వస్తుండగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టాలని సమంత భావిస్తున్నట్టు బోగట్టా. ముంబైలో ఇల్లు కొనుగోలు చేయాలని సామ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొత్తింటి విషయంలో సమంత కొన్ని కండీషన్లు పెడుతున్నారని సమాచారం అందుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం స్వచ్చమైన గాలి వచ్చే వెంటిలేషన్ ఉన్న ఇల్లు కావాలని సమంత రియల్ ఎస్టేట్ బ్రోకర్లను కోరారని బోగట్టా.

సముద్రపు ఫేసింగ్ ఉన్న ఇల్లు మాత్రమే తనకు కావాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కు సమంత చెప్పినట్టు తెలుస్తోంది. శాకుంతలం షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన సామ్ యశోద మూవీలో నటిస్తున్నారు. సమంత కీలక పాత్రలో తెరకెక్కిన కాతువాకుల రెండు కాదల్ త్వరలో విడుదల కానుంది. సమంత బర్త్ డే రోజున ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం. సామ్ వరుసగా సినిమాలతో బిజీ కావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సమంత భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాను, దర్శకుడిని బట్టి సమంత 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సమంత మరింత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus