ఆ హీరోయిన్ భర్త ఎంపీ.. మహిళ దగ్గర హీరోయిన్ ఎంత తీసుకుందంటే..!
December 9, 2022 / 12:53 PM IST
|Follow Us
రోజులు మారుతున్నాయి కానీ మనుషులు, వారి వింత ప్రవర్తన మాత్రం మారడం లేదు.. టెక్నాలజీ, చట్టాలు ఎంత అభివృద్ధి చెందినా మోసాలు అనేవి ఆగట్లేదు.. ఇప్పటి వరకు ఉద్యోగాలిప్పిస్తామని రకరకాలుగా మోసం చేసిన వాళ్లనీ, మోసపోయిన వాళ్లనీ చూశాం.. సినిమా రంగంలోనూ అవకాశాల వేటలో భాగంగా ఇలాంటివి జరుగుతుంటాయి.. అయితే ఏకంగా స్టార్ స్టేటస్ కలిగిన ఓ హీరోయిన్, ఉద్యోగం పేరుతో మరో మహిళను మోసం చేసిందంటే నమ్మగలమా?.. అలాంటి సంఘటనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది..
వివరాల్లోకి వెళ్తే.. వర్ష ప్రియదర్శిని.. ఒడిశా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.. ‘జోర్’, ‘గోల్ మాల్’, ‘లవ్ స్టోరీ’ లాంటి కొన్ని బెంగాలీ సినిమాల్లోనూ కనిపించింది.. నటిగా ఒడియాలో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.. 2014లో అనుభవ్ మెహంతీని పెళ్లి చేసుకుంది.. ఈయన ఎంపీగా పని చేశాడు.. మ్యారేజ్ తర్వాత కూడా ‘రోమియో జూలియట్’, ‘నిమ్కీ’ లాంటి చిత్రాలు చేసింది. ఇంత బ్యాగ్రౌండ్ ఉన్న నటి..
ఉద్యోగం పేరుతో ఓ మహిళను మోసం చేసిందనే కారణంగా ఆమె మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ఓ జ్యువెలరీ షాపులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. వర్ష ఇంకా ఆమె పీఏ ఆయుషి కలిసి కళ్యాణి నాయక్ అనే మహిళ దగ్గరినుండి రూ. 30 వేలు తీసుకున్నారు.. తీరా డబ్బులు చేతికందాక కళ్యాణితో కాంటాక్ట్ కట్ చేశారు. కాల్స్, మెసేజులకి రిప్లై లేకపోవడంతో కళ్యాణి మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది..
వర్ష ప్రియదర్శిని, పీఏ ఆయుషిలపై భువనేశ్వర్‌లోని షాహీద్ నగర్ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు.. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు.. స్టార్ హీరోయిన్ ఇలా చేసిందని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై వర్ష ప్రియదర్శిని కానీ, ఆమె పీఏ ఆయుషి కానీ స్పందించలేదు.. ఇక రాజకీయ వర్గాల్లోనూ వర్ష వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది..