Star Heroine: అయ్యా బాబోయ్ ఏంటి అ వస్తువులను దోంగలించారా? ఇది చాలా ఛీప్!

  • June 10, 2023 / 12:29 PM IST

బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీడింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సారా అలీ ఖాన్, ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కూతురు ఈమె. కెరీర్ ప్రారంభం నుండే తనదైన మార్కు తో సినిమాలను ఎంచుకుంటూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి ‘జరా హాట్కే..జరా బచ్కే’ అనే చిత్రం లో నటించింది.

ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. కేవలం మొదటి వారం లోనే 37 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, అతి త్వరలోనే వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతోంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో సారా అలీ ఖాన్ చేసిన అల్లరి పనుల గురించి చెప్పుకొచ్చాడు విక్కీ కౌశల్.

విక్కీ కౌశల్ మాట్లాడుతూ ‘మేము ప్రొమోషన్స్ చేస్తున్న సమయం లో సారా అలీ ఖాన్ విమానాశ్రయం లోని లాంజ్ లో మంచిగా నిద్రపోయింది. ఆ తర్వాత వచ్చేటప్పుడు రూమ్ లో ఉన్న దిండు ని దొంగలించి తీసుకొచ్చింది. ఆ దిండు ని ఆమె మూడు ఊర్లకు తనతో పాటు తీసుకొచ్చింది’ అని చెప్పుకొచ్చాడు విక్కీ కౌశల్.

అప్పుడు (Star Heroine) సారా అలీ ఖాన్ ని విలేఖరులు ప్రశ్న అడుగుతూ , హోటల్ రూమ్స్ నుండి బయటకి వచ్చేటప్పుడు ఏమైంది మీతో పాటు తీసుకొచ్చారా అని అడగగా, దానికి సారా అలీ ఖాన్ సమాధానం చెప్తూ ‘ నెల రోజుల పాటు మేము ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నాము. అలా ఎన్నో హోటల్స్ లోకి అడుగుపెట్టాము, అలా షాంపూ , కండీషనర్లు , లోషన్స్, టూత్ పేస్ట్ ఇలా ఎన్నో వస్తువులను వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొచ్చేసాను’ అని చెప్పుకొచ్చింది సారా అలీఖాన్.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus