పెళ్లి వేడుకలో డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వనున్న హీరోయిన్లు
November 12, 2016 / 11:00 AM IST
|Follow Us
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి వివాహా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడు రాజీవ్రెడ్డితో బ్రాహ్మణికి ఇటీవల నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా చేశారు. ఈ జంటకు బెంగళూరులోని మెయిన్ ప్యాలెస్ మైదానంలో నవంబరు 16వ తేదీన వివాహం జరగనుంది. ఈ పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లను పిలిచి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.
కల్యాణ మహోత్సవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా, రవితేజ తో పాటు అనేక మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ వేడుకలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప్రియమణి డ్యాన్స్ ఫెరఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. హాస్య నటులు బ్రహ్మానందం, ఆలీ కూడా పెళ్లికి రానున్నారు.. అయితే వీరు స్కిట్ చేస్తారా? చెయ్యరా? అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న ఈ వేడుక ఓ స్పెషల్ ఈవెంట్ గా నిలవనుంది.