తమ స్నేహంతో ఫ్యాన్స్ ని ప్రశ్నిస్తున్న స్టార్ హీరోలు
May 14, 2018 / 08:11 AM IST
|Follow Us
సినీ తారలకు ఫ్యాన్స్ ఉండడం కామన్. ఈ మధ్య ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఆ నెగిటివిటీని తుంచడానికి స్నేహమనే మందు చల్లారు. తాము స్నేహంగా ఉన్నామని చెప్పడమే కాదు, కలిసి కనబడుతున్నారు. ఒకరి ఇంట్లో ఫంక్షన్ కి మరొకరు వెళ్లి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు వెళ్లి స్పీచ్ లు అదరగొడుతున్నారు. ఇదంతా సరిపోదని తరతరాల మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసేందుకు మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం సంచలన విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తామంతా ఒకటే అని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ ముగ్గురుకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారంతా కలిసి పోవాలని కోరుకుంటున్నారు.
అయినా అభిమానుల మధ్య స్నేహం కుదిరినట్టు లేదు. సోషల్ మీడియా వేదికపై ఒకరి మూవీ కలక్షన్స్ పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. రంగస్థలం సినిమా కలక్షన్స్ ఫేక్ అని మహేష్ ఫ్యాన్స్ అంటుంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం భరత్ అనే నేను కలక్షన్స్ లో వాస్తవం లేదని పోస్టర్స్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారు. వాటిని ట్రోల్ చేయడానికి అన్ని పనులు మానుకొని మొబైల్స్, సిస్టం ముందు కూర్చుంటున్నారు. అలా విమర్శలు చేయడాన్ని పనిగా చేసుకున్నవారు ఇప్పటికైనా మారాలి. తాము బురద జల్లడం వల్ల హీరోలకు నష్టం ఏమి లేదని గ్రహించాలి. మీరు వేరే హీరోని తక్కువచేసి మాట్లాడినంత మాత్రానా.. మీ హీరో వచ్చి మీకు సన్మానం చేస్తారనుకోవడం ఇంకా అవివేకం. అందుకే స్టార్ హీరోలు కలిసిపోయారని స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి.. వారి అభిమానులు నెగిటివిటీని దూరం చేసుకుంటే.. వారికీ, పరిశ్రమకి ఎంతో మంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.