Chiranjeevi: చిరంజీవి సినిమాను ఆ నిర్మాత తగలుబెట్టానికి కారణం అదేనా..!
October 10, 2023 / 11:37 AM IST
|Follow Us
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల పాటుగా ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరో గా కొనసాగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణం లో చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ తో పాటుగా, డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని, సెన్సార్ కి వెళ్లిన తర్వాత రిజెక్ట్ చేయబడ్డ చిత్రం ఒకటి ఉంది.
నిర్మాతకి కోపం వచ్చి ఆ సినిమా రీళ్లు మొత్తం మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసాడు. ఆ నిర్మాత మరెవరో కాదు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ప్రముఖ నిర్మాత మల్లెమాల కొడుకు ఈయన. ఆయన తగలపెట్టిన సినిమా రీళ్లు దేనివో కాదు, అంజి చిత్రానిదే. అసలు ఎందుకు అలా చేసాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవి తో (Chiranjeevi) అప్పట్లోనే ఒక భారీ బడ్జెట్ సినిమా చెయ్యాలనే ఉద్దేశ్యంతో ‘అంజి’ చిత్రాన్ని ప్రారంభించాడు.
ఈ సినిమాకి కోడి రామ కృష్ణ దర్శకుడు అనేది మనకి తెలిసిన విషయం. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ముందుగా సభాపతి దీక్షానామూర్తి అనే డైరెక్టర్ పని చేసాడు. సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసాడు. ఔట్పుట్ చూసిన తర్వాత అటు చిరంజీవి కి కానీ, ఇటు శ్యామ్ ప్రసాద్ కి కానీ అసలు ఏమాత్రం నచ్చలేదు. బడ్జెట్ మొత్తం వేస్ట్ అయిపోయింది, ఎలాగో చేసాము కాబట్టి విడుదల చేద్దాం అని సెన్సార్ చేయించారు.
కానీ సెన్సార్ బోర్డు అడుగడుగునా కట్స్ చెప్తూ వచ్చింది. మళ్ళీ ఎడిటింగ్ చేసి మరోసారి సెన్సార్ చేసారు, అప్పుడు కూడా అదే సమస్య. ఇక నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి కోపం వచ్చి, ఈ సినిమా రీల్స్ మొత్తం తగలబెట్టేసాడు. ఆ తర్వాత ఒక రెండేళ్లు గ్యాప్ ఇచ్చి కోడి రామకృష్ణ ని డైరెక్టర్ గా పెట్టుకొని, ఇదే స్టోరీ తో గ్రాండ్ స్కేల్ లో అంజి చిత్రం చేసారు. ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు, యావరేజి గా నిల్చింది.