Chiranjeevi, Jagan: చిరంజీవి జగన్ భేటీపై నిర్మాతల ఆశలివే?
February 9, 2022 / 02:56 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ స్టార్స్ తో కలిసి రేపు సీఎం జగన్ ను కలవనున్నారనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు ఈ భేటీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ భేటీతో ఏపీ టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని నిర్మాతలు నమ్ముతున్నారు. ప్రధానంగా బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు పెరిగితే బాగుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బీ, సీ సెంటర్లలో 40 నుంచి 45 రూపాయలు టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సిద్ధమైందని మంత్రి పేర్ని నాని సీఎం జగన్ కు ఈ నివేదికను అందజేశారని బోగట్టా. ఈ సమావేశానికి ఎన్టీఆర్, మహేష్, నాగార్జున నిర్మాతలు వంశీ, దానయ్య కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. రేపు సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనుందని బోగట్టా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఏపీ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ షోలకు కూడా అనుమతులను సాధించాలని కోరుకుంటున్నారు.
బెనిఫిట్ షోలకు సాధారణ టికెట్ రేట్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం టికెట్ రేట్లు ఉంటే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. టాలీవుడ్ కు సీఎం జగన్ నుంచి వరాలు ఖాయమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ కూడా ఈ భేటీతో తొలగిపోనుందని సమాచారం. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న నంది పురస్కారాలకు సంబంధించిన సమస్యకు కూడా ఈ భేటీతో చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు మ్య్యాగ్జిమం మినిమం అనే విధంగా నిర్ణయిస్తారని సమాచారం. టికెట్ రేట్లు పెరిగితే ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానున్న ఖిలాడీ సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. సీఎం జగన్ టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.