ఈ ఏడాది చిత్ర పరిశ్రమకి అస్సలు కలిసి రాలేదు.. వరుస ప్రమాదాలు, మరణాలు సంభిస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల మృతిచెందారు. ‘కె.జి.ఎఫ్’ తాతగా పాపులర్ అయిన సీనియర్ నటుడు కృష్ణ జి రావు, తమిళ నటుడు శివ నారాయణ మూర్తి.. మనోజ్ బాజ్‌పాయ్ తల్లి గీతా దేవి వంటి వారు కన్నుమూశారు..
బాలీవుడ్ నటి వీణా కపూర్ తన కొడుకు చేతిలో హత్యకు గురయ్యారనే వార్తతో షాక్‌లో ఉండగా.. ఇప్పుడు ప్రముఖ గాయని మరణించారనే వార్తతో హిందీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది.. ప్రముఖ గాయని సులోచన చవాన్ అనారోగ్యంతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.. ఆమె వయసు 92 సంవత్సరాలు.. 1930 మార్చి 13న ముంబైలో జన్మించిన సులోచన.. తన 11వ ఏటనే కెరీర్ ప్రారంభించారు.. రంగస్థలంపై కృష్ణుడి పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.
తర్వాత గుజరాతీ చిత్రాల్లో నటించి.. గాయనిగా హిందీ, మరాఠీ భాషల్లో పాటలు పాడారు.. సినీ దర్శకుడు ఎస్. చవాన్‌తో పెళ్లి తర్వాత తన పేరుకి భర్త పేరుని జత చేసుకున్నారు.. ఈ ఏడాది మార్చిలో సులోచనా చవాన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆమెకు నడుము ఎముక విరిగింది.. ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ముంబై, గుర్‌గావ్‌లోని ఫన్సవాడీలో గల తన నివాసంలో డిసెంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎస్పీ బాలు, లతా మంగేష్కర్ వంటి దిగ్గజాల తర్వాత సంగీత ప్రపంచంలో మరో గొప్ప స్వరం కోల్పోయామంటూ సులోచన చవాన్ మృతికి బాలీవుడ్, మరాఠీ సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!