ఈ మధ్య కాలంలో సినిమా, టీవీ ఇండస్ట్రీలలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటుండగా ఆ ఘటనలు అభిమానులను ఎంతగానో బాధ పెడుతున్నాయనే సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ నటి, యాంకర్ రాజేశ్వరీ రే మోహపాత్ర క్యాన్సర్ తో బాధ పడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. 2019 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న ఈ నటికి క్యాన్సర్ మెదడుకు పాకింది.
చిన్న వయస్సులోనే నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాజేశ్వరి రే మహాపాత్ర మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీవీ, సినీ నటులు సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు. గత కొన్ని నెలలుగా భువనేశ్వర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో రాజేశ్వరి రే చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా వ్యాధి నుంచి కోలుకోలేక ఆమె మృతి చెందారని తెలుస్తోంది.
ఒరియా టీవీ నటులు రాజేశ్వరి రే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. క్యాన్సర్ బారిన పడిన సమయంలో రాజేశ్వరి రే సోషల్ మీడియా ద్వారా తాను క్యాన్సర్ బారిన పడ్డానని వెల్లడించారు. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ నటి ఆ తర్వాత రోజుల్లో సీరియళ్లలో నటించడం ద్వారా క్రేజ్, పాపులారిటీని పెంచుకున్నారు. పలు సినిమాలలో నటించిన ఈ నటి సినిమాల ద్వారా కూడా సత్తా చాటారు.
స్వాభిమానం అనే సీరియల్ ఈ నటిని అభిమానులకు మరింత దగ్గర చేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ఆ పాత్రలతో కూడా రాజేశ్వరి రే మహాపాత్ర మెప్పించారు. ఒడియా బుల్లితెరపై స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది నటీమణులలో ఈమె ఒకరు కావడం గమనార్హం.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!