సినిమా రంగం కేవలం డబ్బుల్ని మాత్రమే కాదు.. ఎంతో పేరుని తీసుకొస్తుంది. ఎక్కడకు పోయినా నీరాజనాలు పలికే అభిమానులను ఏర్పరుస్తుంది. ఆ పాపులారిటీ తెలియకుండానే గర్వాన్ని, పొగరుని ఒంటిలోకి తీసుకొస్తుంది. వాటిని తలకు ఎక్కించుకున్నా పరవాలేదు.. తలెత్తుకొని జీవించేలా చేసిన తల్లి దండ్రులను మాత్రం గుండెల్లోంచి కిందకు దించకూడదు. ఆ విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఎల్లప్పుడూ ముందు ఉంటారు. ఎన్ని ఉన్నత శిఖరాలు ఎక్కినా తల్లిదండ్రులు బిడ్డగానే మసులుకుంటూ మరింతమంది అభిమానాన్ని చూరగొంటున్నారు. అటువంటి హీరోల్లో కొంతమంది పై ఫోకస్..
అంజనాదేవిచిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ముగ్గురు సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. వీరు నాన్న వెంకట్రావుతో కంటే అమ్మ అంజనాదేవితో ఎంతో క్లోజ్ గా ఉంటారు. పేరు ప్రఖ్యాతలు పక్కన పెట్టి అమ్మ మాటకు విలువ ఇస్తూ ఎదుగుతున్నారు.
ఇందిరా దేవి సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణకి నట వారసుడిగా నిరూపించుకున్నారు. ఈయన తల్లి దండ్రులను చాలా గౌరవిస్తారు. బాగా చూసుకుంటారు. అమ్మ ఇందిరా దేవిని ఏదైనా కార్యక్రమానికి తీసుకెళ్తే మొదటి వరకు చివరి వరకు ఆమె వెంటే ఉండి, ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు.
శివకుమారిప్రతి బిడ్డకి తల్లి దేవత. అలానే తన తల్లి శివకుమారిని చూసుకుంటారు ప్రభాస్. సినిమాల్లో బిజీగా ఉన్న ప్రతి రోజూ తల్లితో మాట్లాడకుండా ఉండలేరు. ఆ ప్రేమతోనే తల్లి పాత్రకు విలువున్న కథలతోనే ఎక్కువ సినిమాలు చేశారు.
నిర్మల ప్రముఖ అల్లు అరవింద్ తనయులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు తల్లి నిర్మల బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు అమ్మతో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకొంటారు. ఆమెకు ఇష్టం లేని పని అస్సలు చేయరు.
విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గొప్ప దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవం అందుకున్నారు. తాను ఎంత ఎత్తు ఎదిగినా తండ్రి (విజయేంద్ర ప్రసాద్) కి బిడ్డనే అంటూ, అందరి ముందు విజయేంద్ర ప్రసాద్ షూ కి లేస్ కట్టి ప్రేమను చాటుకున్నారు.
హరికృష్ణజూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంటే అమితమైన ప్రేమ. అతనితో కలిసి గడిపిన సమయం తక్కువైనప్పటికీ తారక్ కి ఎనలేని అభిమానం. ఆ ఇష్టంతోనే నాన్నకు ప్రేమతో అనే మూవీని తీశారు. ఈ సినిమా ఆడియో వేడుకలో తండ్రి ముందు మోకాలిపై కూర్చొని ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
చిరంజీవి చిరంజీవి అందరికీ రీల్ హీరో అయితే రాంచరణ్ కి మాత్రం రియల్ హీరో. ఫ్రెండ్, గైడ్ అన్నీ చిరునే. అందుకే తన తండ్రిని హీరోగా రీలాంచ్ చేసే బాధ్యతను తీసుకొని ఖైదీ నంబర్ 150 మూవీ నిర్మించి తండ్రిపై ప్రేమను చాటుకున్నారు.
నాగార్జున అక్కినేని నాగేశ్వరరావుకి నాగార్జున మంచి కొడుకుగానే కాదు బిడ్డకి మంచి తండ్రిగా నిరూపించుకున్నారు. అఖిల్ కి నాగ్ ఫస్ట్ హీరో. అమ్మకూచిగా పెరిగినప్పటికీ తండ్రితో ఎంతో క్లోజ్ గా ఉంటారు.