బాహుబలి సినిమాతో రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. అతనితో సినిమా నిర్మించాలని బాలీవుడ్ నిర్మాతలు సైతం క్యూలో ఉన్నారు. భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అయినా జక్కన్న ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగు నిర్మాతలతోనే సినిమా చేస్తున్నారు. అయితే ఈసారి తెలుగు హీరోలతో పాటు ఇతర భాషా హీరోలు ఉండనున్నారు. తన పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఓ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి సిద్ధమయినట్లు తెలిసింది.
తెలుగు, తమిళ హీరోలు నటించే విధంగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం ఓ ఎమోషనల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఆ కథ చర్చల్లోనే తండ్రి, కొడుకులు బిజీగా ఉన్నారంట. ఈ స్టోరీ కొలిక్కి రాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలైన కె.ఎల్.నారాయణ, డీవీవీ దానయ్య లు కలిసి ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.