‘మిస్టర్ నూకయ్య’ డైరెక్టర్ నుండి ఒటిటి ఫిలిం

  • October 6, 2020 / 12:35 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒటిటి కోసం ప్రాజెక్టులు చేస్తున్న డైరెక్టర్లు చెప్పుకోదగ్గ రీతిలో వున్నారు. సతీష్ వేగేశ్న, సుకుమార్, ‘పలాస’ డైరెక్టర్ కరుణ కుమార్, చందూ మొండేటి, సుధీర్ వర్మ తదితరులు ఒటిటి (ఓవర్ ది టాప్) ఫ్లాట్‌ఫార్మ్స్ అయినటువంటి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ జీ 5 కోసం వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో అనిల్ కృష్ణ కన్నెగంటి జాయిన్ అయ్యాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘అసాధ్యుడు’,

మంచు మనోజ్ హీరోగా ‘మిస్టర్ నూకయ్య’, సందీప్ కిషన్ హీరోగా ‘రన్’ సినిమాలకు అనిల్ కృష్ణ కన్నెగంటి డైరెక్షన్ చేశాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే… సుబ్బరాజు, రఘు కుంచెతో అతడు ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చెయ్యలేదు. హీరో బేస్డ్ సినిమాలా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో అనిల్ కృష్ణ కన్నెగంటి ఈ సినిమా చేస్తున్నార్ట. సోసైటీలో ఒక ఇష్యూతో థ్రిల్లర్ తరహా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని టాక్.

సోషల్ థ్రిల్లర్ జానర్ కిందకు వస్తుందట. ఇందులో సుబ్బరాజు, రఘు కుంచె కాకుండా ఇంకా చాలామంది యాక్ట్ చెయ్యనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒటిటి కోసం ఈ సినిమా చేస్తున్నారని తెలిసింది. ఒటిటి ఒరిజినల్ వెబ్ ఫిలిం అనుకోవచ్చు. సినిమా యూనిట్ నుండి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చు.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus