ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
March 25, 2021 / 11:49 AM IST
|Follow Us
డైరెక్టర్ అనేవాడు సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. సక్సెస్ వచ్చినా అతన్నే పొగుడుతారు.. ఒకవేళ సినిమా బాగా రాకపోయినా మొదట అతన్నే తిడతారు. అయితే ఆ డైరెక్టర్ కు వెనుక నుండీ కొంతమంది రచనలోనూ అలాగే నటీనటులకు సీన్లు వివరించి ప్రిపేర్ చెయ్యడానికి అసిస్టెంట్లు కూడా ఉంటారని బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళనే అసిస్టెంట్ డైరెక్టర్లంటుంటారు. అయితే వీళ్ళను తక్కవ అంచనా వెయ్యడానికి లేదు. హీరోలతోనూ, నిర్మాతలతోనూ పరిచయాలు సంపాదించుకుంటారు కాబట్టి.. మెల్లగా మంచి కథల్ని రెడీ చేసుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యి డైరెక్టర్లుగా మారిపోయి హిట్లు మీద హిట్లు కొడుతుంటారు. అలా అని అందరూ సక్సెస్ అవుతారని చెప్పలేము. అయితే సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న కొంతమంది దర్శకులు మరియు వారి గురువులను ఓ లుక్కేద్దాం రండి :
1) బుచ్చిబాబు సానా:
‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడు మన సుకుమార్ గారి శిష్యుడు. ‘1 నేనొక్కడినే’ ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.
2)పరశురామ్(బుజ్జి):
ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఇతను ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసినవాడే..!
3)కొరటాల శివ:
ఒకప్పుడు బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాడు. అంతేకాకుండా ‘ఒక్కడున్నాడు’ ‘మున్నా’ వంటి చిత్రాలకు కూడా అసిస్టెంట్ గా పనిచేసాడు.
4)సందీప్ రెడ్డి వంగా:
‘అర్జున్ రెడ్డి’ వంటి గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించి టాలీవుడ్ క్రేజ్ ను మరింత పెంచిన సందీప్ రెడ్డి.. నాగార్జున నటించిన ‘కేడి’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.
5)హను రాఘవపూడి:
‘అందాల రాక్షసి’ ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ ‘లై’ ‘పడి పడి లేచె’ మనసు వంటి సినిమాలను తెరకెక్కించిన ఇతను మన చంద్రశేఖర్ యేలేటి గారి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసాడు.
6)సుధ కొంగర:
‘గురు’ ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈమె.. మన మణిరత్నం గారి శిష్యురాలు. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసింది.
7)అనిల్ రావిపూడి:
అపజయమెరుగని దర్శకుల లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్న ఇతను శ్రీనువైట్ల, సంతోష్ శ్రీనివాస్, ‘సిరుతై’ శివ వంటి మాస్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేసాడు.
8)వెంకీ కుడుముల:
‘ఛలో’ ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వెంకీ.. మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి శిష్యుడు.
9)నాగ్ అశ్విన్:
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన ఇతను మన శేఖర్ కమ్ముల గారి శిష్యుడు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసేస్తున్నాడు.
10)హరీష్ శంకర్:
మన రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ ల శిష్యుడు. అదే బోల్డ్ నెస్ అదే ధైర్యంతో సినిమాలు చేస్తున్నాడు.