Rakshasudu 2: ‘రాక్షసుడు’ సీక్వెల్ కోసం స్టార్ హీరో!

  • August 23, 2022 / 07:45 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ తీయాలని భావించారు. సీక్వెల్ లో కూడా బెల్లంకొండే హీరోగా కనిపిస్తారని అనుకున్నారు. కానీ ఆయన ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. దర్శకుడు రమేష్ వర్మ కూడా లీడ్ రోల్ లో మరో హీరోని తీసుకోవాలనుకున్నారు.

ఈ మేరకు చాలా మంది హీరోలను పరిశీలించారు. ఫైనల్ గా కన్నడ స్టార్ హీరో సుదీప్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇటీవల ‘విక్రాంత్ రోణ’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. రీసెంట్ గా రమేష్ వర్మ చెప్పిన ‘రాక్షసుడు 2’ స్టోరీ సుదీప్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించనున్నారు.

మరి మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. హారర్ థ్రిల్లర్ గా సినిమా రూపొందనుంది. ఇందులో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. అలానే విలన్ రోల్ కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారట.

ఆయన గనుక ఓకే చెబితే.. ‘రాక్షసుడు2’ సినిమాకి సౌత్ లో మంచి క్రేజ్ రావడం ఖాయం. ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. వచ్చే వేసవికి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పోటీ ఉంటే మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విడుదలవుతుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus