Sudeepa Pinky: చేతులారా చేసుకున్నాను.. ఇప్పుడు దేవుడు టెస్ట్ చేస్తున్నాడు..!
September 15, 2022 / 01:36 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లోకి పింకీగా వచ్చిన సుదీప ఇప్పుడు తన స్టోరీతో అందరికీ కంట తడిపెట్టించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో అల్లరి పిల్లగా చేసిన సుదీప ఇప్పుడు పిల్లలకోసం తపస్సు చేస్తోంది. అందరి దీవెనలు కావాలని, త్వరలోనే అమ్మని అవ్వాలని కోరుకుంటున్నానంటూ చెప్పింది. అంతేకాదు, కేవలం తన తప్పిదం వల్లే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అంటూ చెప్పుకొచ్చింది. 2015లో తను కన్సీవ్ అయ్యాయనని కానీ, అప్పుడు ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ రావడం, ఇంకా సెటిల్మెంట్ అనేది లేకపోవడం వల్ల వద్దనుకున్నాను. ఆస్ట్రేలియాలో ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీని తీయించేసుకున్నా.
అప్పుడు ఎందుకో అంత ఎటాచ్ కూడా అవ్వలేదు. ఇక ఆ తర్వాత మూడు సంవత్సారాలలో కొద్దిగా సెటిల్మెంట్ వచ్చింది. అందరూ పిల్లలు అంటుంటే పిల్లలకోసం ప్రయత్నించాం. కన్సీవ్ కూడా అయ్యాను. కానీ, మూడో నెలలోనే స్కానింగ్ కి వెళ్లే టైమ్ లోనే అబార్షన్ అయిపోయింది. అప్పుడు థైరాయిడ్ కూడా చాలా హై వచ్చేసింది. చాలా బాధపడ్డాను. బాగా ఏడ్చాను. మా ఆయన ఎంత ధైర్యం చెప్పినా కూడా వినలేదు. ఫస్ట్ లో ఉన్న కాన్ఫిడెన్స్ మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది.
అప్పట్నుంచీ మళ్లీ ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఎంతో మంది డాక్టర్స్ దగ్గరకి వెళ్లాం. ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతానేమో అని భయమేసింది. అప్పుడే బిగ్ బాస్ ఆపర్ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి స్టోరీల గురించి తెలుసుకోవడం జరిగింది. నిజానికి సోషల్ మీడియాలో నేను అంత యాక్టివ్ గా ఉండను. కాస్త ఈ టైమ్ ని ఉపయోగించుకుని మళ్లీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి వచ్చానని చెప్పింది.
అంతేకాదు, తమ భర్త రంగనాధ్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం అని, నా చెల్లి పాపతో బాగా ఆడుకుంటారని అంది. నా పిల్లలతో ఎప్పుడు ఆడుకుంటానో అన్న మా ఆయన కోరిక తీరాలని ఆశపడింది. బేబీ టాస్క్ వచ్చినపుడు సుదీప బేబీ అని రాసి ఉన్న ట్యాగ్ చూస్తే కన్నీళ్లు ఆగలేదని పార్టిసిపెంట్స్ తో తన మనసులో మాటని బయటపెట్టింది. రెండురోజులు టాస్క్ లోనే బేబీని ఇస్తుంటే బాధ కలుగుతోంది. ఒక్కోసారి మా చెల్లి పాపని ఐదారు రోజులు ఇంట్లో ఉంచుకుని మళ్లీ తిరిగి ఇస్తుంటే ప్రాణం పోయినట్లుగా ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంది సుదీప.
ఎప్పుడూ గల గల మాట్లాడుతూ నవ్వుతూ నవ్వించే సుదీప జీవితంలో ఇంకో కోణం కూడా ఉందని హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా తెలిసింది. సుదీప హార్ట్ టచ్చింగ్ స్టోరీ గురువారం టెలికాస్ట్ కానుంది. అదీ మేటర్.