Sudeepa Pinky: ఒకరోజు మొత్తం నన్ను ఆడిషన్స్ చేశారు: సుదీప

  • September 10, 2022 / 12:30 PM IST

వెంకటేష్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరికెక్కిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇందులో హీరో హీరోయిన్ల పాత్ర ఎలా ఉందో చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ పాత్ర కూడా అంతే ఉందని చెప్పాలి. ఇలా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పింకీ పాత్రలో సుదీప నటించారు. ఇక ఈ సినిమాతో ఈమె ఇప్పటికీ పింకీగానే గుర్తింపు పొందారు.ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన సుదీప తర్వాత పలు సినిమాలలో సీరియల్స్ లో నటించినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.

ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్ర గురించి ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం తన కన్నా ముందుగా 27 మందిని ఆడిషన్స్ చేశారని తెలిపారు. ఇలా 27 మందిని ఆడిషన్స్ చేసినప్పటికీ చివరికి తనని సెలెక్ట్ చేశారని సుదీప పేర్కొన్నారు.

అయితే ఈ సినిమాలో తన పాత్ర చాలా నిడివి ఎక్కువగా ఉండటం వల్ల తనని ఒక రోజు మొత్తం ఆడిషన్స్ చేశారని ఈ సందర్భంగా ఈమె తెలిపారు. ఇక ఆర్తి అగర్వాల్ తో పోలిస్తే తను కాస్త డిఫరెంట్ గా ఉండడం కోసమే తనకు ఈ సినిమాలో స్పెట్స్ ఇచ్చారని సుదీప వెల్లడించారు. ఇక సినిమా కోసమే తాను స్పెట్స్ పెట్టుకున్నానని, అంతకుమించి నాకు ఎలాంటి సైట్ లేదని ఈమె తెలిపారు. ఇక ఈ సినిమా కోసం ఒక రోజు మొత్తం తనకు ఆడిషన్స్ నిర్వహించి చివరకు తనని సెలెక్ట్ చేశారని,

ఇక ఈ సినిమా తనకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చిందని తెలిపారు.ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు నన్ను అసలు పేరుతో పిలవడం మర్చిపోయి పింకీ గానే పిలుస్తున్నారు. ఇప్పటికీ తనని పింకీనే అని పిలుస్తారని వెల్లడించారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరిని మెప్పించిన ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఎలా ఎంటర్టైన్ చేస్తారో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus