Sudeepa Pinky: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ సుదీప ప్రేమ, పెళ్లి కహానీ..!
September 9, 2022 / 05:28 PM IST
|Follow Us
‘బిగ్ బాస్ 6’ సందడి మొదలై 5 రోజులు కావస్తోంది. సెప్టెంబర్ 4న గ్రాండ్ గా ప్రారంభమైంది బిగ్ బాస్. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళలో చాలా మంది తెలీని మొహాలే ఉన్నాయి. తెలిసిన మొహాలు అంటూ ఉంటే.. అందులో సుదీప కూడా ఒకరు. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సుదీప.. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో పింకీ గా బాగా ఫేమస్ అయ్యింది.
ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు ఆమె పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అప్పటి నుండి ఈమె ఎక్కడికి వెళ్లినా పింకీ అనే పిలుస్తున్నారట. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన సుదీప.. నాగార్జున సినిమాల్లో మాత్రం నటించలేకపోయింది అని హౌస్లోకి వెళ్లే ముందు స్టేజి పై చెప్పుకొచ్చింది. ఇక అటు తర్వాత ఈమె సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. సుదీప పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలిసుండదు.
శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమ వ్యవహారం మొదట ఇంట్లో చెప్పినప్పుడు వీరి పెద్దలు ఒప్పుకోలేదట. వారిని ఒప్పించేందుకు నాలుగేళ్లు టైం పట్టిందని చెప్పుకొచ్చింది.ఆ 4 ఏళ్ళు ఈమె నరకం చూసిందట. ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు తీసుకురావడం అవి తనకి ఇష్టం లేదు అని చెప్పడం, ఇంట్లో గొడవలు అవ్వడం..
రెండేసి రోజులు, మూడేసి రోజులు సరిగ్గా తినకుండా ఉండడం.. ఇలాంటివి జరిగేవట. ఫైనల్ గా ఆమె ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పింకీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.కానీ నటనకు గుడ్ బై చెప్పలేక సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.