Sudheer Babu: బాలీవుడ్‌ మెగా ప్రాజెక్టు వదులుకున్న సుధీర్‌బాబు!

  • February 12, 2022 / 01:33 PM IST

టాలీవుడ్‌లో కథానాయకుడిగా రాణిస్తూనే, బాలీవుడ్‌లో నటించిన వాళ్లు తక్కువ మందే ఉంటారు. అలా వెళ్లి రాణించిన వారు ఇంకా తక్కువమంది అని చెప్పాలి. అలాంటి కొద్దిమందిలో సుధీర్‌బాబు ఒకరు. తెలుగులో హీరోగా రాణిస్తూనే… హిందీలో ‘బాఘి’ అనే సినిమా చేశారు. అందులో సుధీర్‌బాబు పండించిన విలనిజానికి మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో మరో హిందీ సినిమా కూడా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వదులుకున్నారట. సుధీర్‌బాబు నటించిన ‘ఆ అమ్మయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా త్వరలో విడుదలవుతోంది.

Click Here To Watch

ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుధీర్‌ బాబు. ఈ క్రమంలో ఓ బాలీవుడ్‌ మీడియా వెబ్‌సైట్‌కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగానే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా గురించి చర్చ జరిగింది. ఆ సినిమాలో తనకో అవకాశం వచ్చిందని, కానీ చేయలేకపోయాయనని చెప్పాడు సుధీర్‌బాబు. హిందీలో నా తొలి చిత్రం ‘బాఘీ’లో విలన్‌గా నా నటనకు మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్‌ నుండి ఇప్పటికీ నటించమని ఫోన్స్‌ వస్తున్నాయి. కానీ ఇక్కడ సినిమాలు ఉండటం వల్ల కుదరడం లేదు.

అలా కొన్ని రోజుల క్రితం అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా భట్‌ నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోనూ ఓ ఆసక్తికర పాత్ర వచ్చింది. అయితే ఆ సినిమా చిత్రీకరణకు ఎక్కువ రోజులు కాల్‌షీట్లు కేటాయించాల్సి వచ్చింది. అదే సమయంలో ‘సమ్మోహనం’ సినిమాతో బిజీగా ఉన్నాను. అందుకే ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేనేమో అనిపించింది. దీంతో ఆ పాత్ర వదులుకున్నా. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా లాంటి పాన్‌ ఇండియా మూవీలో నటించడమంటే చాలా పెద్ద అవకాశం. కానీ వదలుకోక తప్పలేదు. ‘సమ్మోహనం’ నా కెరీర్‌లో ఆల్‌ టైమ్ హిట్‌ సినిమాగా నిలిచింది అని చెప్పాడు సుధీర్‌బాబు.

దీంతో ఆ సినిమా వదలుకున్నా… మరో మంచి సినిమా చేశాను అనే ఆనందం ఉంది అని చెప్పాడు. సుధీర్‌బాబు – మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ త్వరలో విడుదలవుతుంది. గతంంలో ఈ ఇద్దరూ ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలు చేశారు ఇప్పుడు ‘ ఆ అమ్మాయి…’ హ్యాట్రిక్‌ సినిమా. ఇక జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లోనూ సుధీర్‌బాబు నటించనున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలో ఈ సినిమా ఉంటుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus