Sudheer Babu: ఇంటర్వ్యూ: ‘మామా మశ్చీంద్ర’ మూవీ గురించి సుధీర్ బాబు చెప్పిన ఆసక్తికర విషయాలు!
October 5, 2023 / 12:32 PM IST
|Follow Us
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన మామా మశ్చీంద్ర చిత్రం ఈ అక్టోబర్ 6 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు పాల్గొని కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీకోసం:
ప్ర) మీరు చాలా ఫిట్ గా ఉంటారు.. ‘మామా మశ్చీంద్ర’ లో చేయాలని ఎందుకు అనిపించింది?
సుధీర్ బాబు : హర్ష చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఇది డిఫరెంట్ స్క్రిప్ట్. మనం, గుండెజారే గల్లంతైయ్యిందే చిత్రాలతో ఆయన మంచి రైటర్ గా నిరూపించుకున్నారు. రైటింగ్ లో అతనికి బాగా పట్టు ఉంది. ‘మనం’ చూసినప్పుడు ఎంత కొత్తగా అనిపించిందో.. మామా మశ్చీంద్ర చూసినప్పుడు అంతా కొత్త అనుభూతి పొందుతారు.
ప్ర) టాలీవుడ్ లో కొంతమంది హీరోలు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు.. మీకు ఎలా అనిపించింది?
సుధీర్ బాబు : ఈ కథ వినగానే నన్ను ఎక్సైట్ చేసింది అదే. కృష్ణమ్మ కలిపింది, భాగీ, భలే మంచి రోజు లాంటి చిత్రాలలో డిఫరెంట్ రోల్స్ అనిపించాయి. అందుకే చేశాను. ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేశారు. మామ మశ్చీంద్ర లో ట్రిపుల్ రోల్ ని అనేది ఆసక్తి కలిగించిన అంశం. ఇందులో మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. ఒకటి తెలంగాణ, మరొకటి ఉత్తరాంద్ర, ఇంకొ పాత్రకు రాయలసీమ యాస ఉంటుంది. ఈ మూడు యాసలు నావి కాదు. ఓల్డ్ పాత్రకు ఇంకో డబ్బింగ్ ఉంటుంది. అది నా రెగ్యులర్ భాష. ప్రతి పాత్రకు వేరియేషన్ ఉంది. ఒక పాత్ర కోసం బరువు పెరిగాను. మరో పాత్రకు ప్రోస్తటిక్స్ వాడాం. యంగ్ గా కనిపించే పాత్ర కోసం డైట్ రొటీన్ పాటించాను. ఈ చిత్రం మెంటల్ గా ఫిజికల్ గా నాకు ఒక ఛాలెంజ్. ఇందులో చాలా ట్విస్ట్ లు కూడా ఉన్నాయి.
ప్ర) ట్రైలర్ విడుదల వేడుకలో బాగా ఎమోషనల్ అయ్యారు.. కారణం?
సుధీర్ బాబు : నా గత సినిమా హంట్ విషయంలో కొందరు ఘోరమైన టాక్ చెప్పారు. దానికి నేను బాధపడలేదు. కానీ ‘ సూపర్ స్టార్ కృష్ణ గారు కనుక ఈరోజు ఉండుంటే.. ఈ సినిమా చూసి ఉండుంటే ఇప్పుడు చనిపోయేవారు ‘ అనడం నాకు చాలా బాద అనిపించింది.
ప్ర) వాస్తవానికి హంట్ క్లైమాక్స్ లో మిమ్మల్ని అలా యాక్సెప్ట్ చేయలేకపోయారు కాబట్టి.. మిమ్మల్ని అభిమానించే వారు ఎక్కువ మంది ఉన్నారు అని మీరు పాజిటివ్ గా ఎందుకు తీసుకోకూడదు?
సుధీర్ బాబు : నిజమే… కానీ నేను కొత్త అటెంప్ట్ చేశాను. అది నచ్చినా.. నచ్చకపోయినా.. నా ప్రయత్నాన్ని అభినందిస్తారు అనుకున్నా. కానీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఆ క్లైమాక్స్ ను డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు అలాంటి వాటిని ప్రోత్సహించరు అని నాకు అప్పుడు తెలిసి వచ్చింది. మామా మశ్చీంద్ర మాత్రం అందరినీ అలరిస్తుంది అని నేను నమ్ముతున్నాను.
ప్ర) ఈ సినిమాలో కృష్ణ గారితో ఓ సీన్ చేయించాలని అనుకున్నారట ?
సుధీర్ బాబు : నిజమే. స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అనుకున్నాం. అయితే అప్పటికే కృష్ణ గారు సినిమాలు చేయడం ఆపేశారు. కానీ ఆయన్ని ఎలాగైనా ఒప్పించగలననే నమ్మకం నాకు వుంది. చాలా మంచి సీన్. గ్రీన్ మ్యాట్ లో నైనా షూట్ చేయాలని అనుకున్నాం. కానీ ఆయన వెళ్ళిపోయారు. ఆయన లేకపోతే ఆ సీన్ కి ప్రాధాన్యతే లేదు. అందుకే ఆ సీన్ తీయలేదు. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాం.
ప్ర) ఈ మూడు పాత్రల్లో ఆడియన్స్ ని ఆకర్షించే పాత్ర ఏది అవుతుంది అనుకుంటున్నారు?
సుధీర్ బాబు : దుర్గా పాత్రలో చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. పరశురాం పాత్ర కథలో చాలా కీలకం. ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు.
ప్ర) హర్ష వర్ధన్ గారి దర్శకత్వంలో చేయడం ఎలా అనిపించింది ?
సుధీర్ బాబు : హర్ష పై నాకు చాలా నమ్మకం ఉంది. అతను మంచి రైటర్, యాక్టర్ కూడా. దీనికి ముందు కూడా ఒక సినిమా చేశాడు. అలా ఒక అనుభవం ఉన్న దర్శకుడితో పని చేస్తున్నట్లుగానే అనిపించింది.
ప్ర) హీరోయిన్స్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ?
సుధీర్ బాబు : ఈషా రెబ్బా తెలుగమ్మాయి. తెలుగు వాళ్ళతో పని చేయడంలో చాలా కంఫర్ట్ ఉంటుంది. ఆమె మంచి నటి. మృణాలిని కూడా తెలుగు నేర్చుకొని చక్కగా నటించింది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా వాళ్ల ఇమేజ్ ఇంకా పెరుగుతుంది.
ప్ర) నిర్మాతల గురించి ?
సుధీర్ బాబు : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ గారు ఎంతో అనుభవం వున్న నిర్మాతలు. ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టారు.
ప్ర) కృష్ణగారి బయోపిక్ అంటూ చేస్తే మహేష్ గారు నిర్మిస్తాను అన్నారు? మీరు నటించే అవకాశం ఉందా?
సుధీర్ బాబు : తప్పకుండా.. నటిస్తాను. చాలా మంది ఆయన డాన్స్, యాక్టింగ్ ని ఇమిటేట్ చేస్తారు. కానీ ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన ప్యూర్ సోల్ గురించి చాలా మందికి తెలీదు. దానికోసం చేయాలని ఉంది.
ప్ర) బయోపిక్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి కదా?
సుధీర్ బాబు : కృష్ణ గారి జీవితంలో చాలా స్ట్రగుల్ ఉంది. చాలా మందికి తెలీదు. కానీ అది చాలా మంది జీవితంలో ఉన్నదే..!
ప్ర) పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి ?
సుధీర్ బాబు : గోపీచంద్ బయోపిక్ ఖచ్చితంగా ఉంటుంది. స్క్రిప్ట్ పనులు నడుస్తూనే ఉన్నాయి.
ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి?
సుధీర్ బాబు : మా నాన్న సూపర్ హీరో అనే సినిమా డబ్బింగ్ స్టేజ్ లో వుంది. అలాగే (Sudheer Babu) నా కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘హరోం హర’ షూటింగ్ దశలో ఉంది.