Sudheer Babu, Payal Rajput: స్టేజి పైనే పాయల్ పరువు తీసిన సుధీర్ బాబు..ఆమె డ్రెస్సింగ్ పై షాకింగ్ కామెంట్స్..!
August 18, 2022 / 06:05 PM IST
|Follow Us
సినిమా వేడుకలకు హీరోయిన్లు వేసుకొచ్చే డ్రెస్సులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఒక్కోసారి ట్రోలింగ్ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు..! తాజాగా పాయల్ పరిస్థితి కూడా అదే జరిగింది. ఈ మధ్యనే ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సుధీర్ బాబు, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కూడా హాజరయ్యారు. అయితే పాయల్ వేసుకొచ్చిన డ్రెస్ ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
స్టైల్ కోసం ఆమె జీన్స్ ప్యాంటు వేసుకొచ్చింది. ఆ ప్యాంటు కి చిరుగులు లాంటి డిజైన్ ఉండడంతో వింతగా కనిపించింది. అక్కడ పాయల్ ను చూడగానే అందరికీ అదే అనిపించి ఉండొచ్చు. కానీ హీరో సుధీర్ బాబు మాత్రం ఓపెన్ అయిపోయాడు. “నీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పు..నేను ఇస్తాను… మంచి ప్యాంటు కొనుక్కో.. ఇలాంటిది ఎందుకు”.. అంటూ స్టేజి పైనే పాయల్ పరువు మొత్తం తీసేసాడు సుధీర్ బాబు.
అంతేకాదు ‘మీరు ఒప్పుకోరేమో.. మీకు ఇలాగే బాగుండి ఉంటుంది’ అన్నట్టు ఆడియన్స్ పై కూడా ఓ సెటైర్ వదిలేశాడు సుధీర్ బాబు. అతను పాయల్ పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అనంతరం ‘ఆమె ఓ వేవ్ లా ఇండస్ట్రీకి వచ్చిందని, ‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయని.. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు’ అతను చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా… ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం కోసం పాయల్ రాజ్ పుత్ కు ఎక్కువ పారితోషికం ఇచ్చారని వినికిడి. ఈ మధ్య కాలంలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు… అయితే ‘తీస్ మార్ ఖాన్’ కోరి వచ్చిన అవకాశం కాబట్టి ఆమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసినట్లు స్పష్టమవుతుంది.