Sudheer Babu: పెద్ద మనస్సు చాటుకున్న సుధీర్ బాబు!

  • July 12, 2021 / 07:59 AM IST

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్నారు. అయితే సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సాయం చేసే గుణం మాత్రం కొందరు హీరోలకే ఉంటుంది. స్టార్ హీరో మహేష్ బాబు ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు బావ సుధీర్ బాబు మాత్రం సాయం విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. శ్రీకాకుళంకు చెందిన చిన్నారికి సుధీర్ బాబు సాయం చేయడంతో పాటు ఆ పాప భవిష్యత్తు కోసం డబ్బులను ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం కేశవరాయునిపాలెంలో జీవనం సాగిస్తున్న లక్ష్మి, మోసె దంపతుల కూతురు సంస్కృతి జాస్మిన్ గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతుండగా ఈ విషయం సుధీర్ బాబు దృష్టికి వచ్చింది. సుధీర్ బాబు తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1,70,000 రూపాయలు చెల్లించి సంస్కృతికి గుండె ఆపరేషన్ చేయించారు. ఆ తరువాత సంస్కృతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 1,50,000 రూపాయలు శ్రీకాకుళంలోని హెడ్ పోస్టాఫీస్ లో సుధీర్ బాబు డిపాజిట్ చేశారు.

సుధీర్ బాబు సేవాసమితి గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. చిన్నారి వైద్య సహాయం కొరకు సహాయం చేసినందుకు సంస్కృతి జాస్మిన్ తల్లిదండ్రులు సుధీర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సుధీర్ బాబు ప్రస్తుతం శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాలో నటిస్తున్నారు. పలాస్ డైరెక్టర్ కరుణాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus