Sudheer Babu, Prabhas: ప్రభాస్ పై మహేష్ బావ షాకింగ్ కామెంట్స్!

  • August 24, 2021 / 11:38 AM IST

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సంక్రాంతికి రిలీజ్ కానుండగా సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు ఆదిపురుష్ సినిమా ఆగష్టులో రిలీజ్ కానుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆ సినిమా రిలీజ్ డేట్ మారుతుందేమో చూడాల్సి ఉంది. తాజాగా సుధీర్ బాబు ప్రభాస్ గురించి శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా శ్రీదేవి సోడా సెంటర్ తెరకెక్కుతుండగా ఆగష్టు 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సుధీర్ బాబు తాను ప్రభాస్ ఇంటికి వెళ్లానని ప్రభాస్ మంచి తిండి పెట్టారని వారంలో ఒక్కరోజు ప్రభాస్ ఇంటికి వెళితే సిక్స్ ప్యాక్స్, ఫిట్ నెస్ లు ఉండవని సుధీర్ బాబు షాకింగ్ కామెంట్లు చేశారు. అన్నీ గల్లంతే అంటూ ప్రభాస్ గొప్పదనం గురించి సుధీర్ బాబు చెప్పకనే చెప్పేశారు.

సర్కారు వారి పాట టీజర్ లో మహేష్ స్టైల్ ను ఇమిటేట్ చేస్తూ సుధీర్ బాబు మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేశారు. సుధీర్ బాబుకు జోడీగా ఆనంది ఈ సినిమాలో నటించగా పలాస ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. శ్రీదేవి సోడా సెంటర్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus