అల్లరి నరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘సుడిగాడు’ మూవీ. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2012వ సంవత్సరం ఆగష్ట్ 24న విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 9 ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. 100 సినిమాలకు పేరడీగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు. ‘తమీజ్ పడం’ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. అప్పట్లో అల్లరి నరేష్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. మినిమం గ్యారెంటీ అనే ముద్ర కూడా ఉండేది. అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టింది.
ఆ వివరాలను మీరు కూడా ఓ లుక్కేయండి :
నైజాం | 7.18 cr |
సీడెడ్ | 3.08 cr |
ఉత్తరాంధ్ర | 2.14 cr |
ఈస్ట్ | 1.57 cr |
వెస్ట్ | 1.22 cr |
గుంటూరు | 1.81 cr |
కృష్ణా | 1.34 cr |
నెల్లూరు | 0.59 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.93 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.01 Cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 19.94 Cr |
‘సుడిగాడు’ చిత్రానికి రూ.8.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.19.94 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్లకు రూ.11.27 కోట్ల భారీ లాభాలు దక్కాయన్న మాట. అల్లరి నరేష్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రం తర్వాత నరేష్ కు ‘నాంది’ వరకు హిట్టు లేదు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!