సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ షో ద్వారా లక్షలాది మంది ఆడియెన్స్ ను ఎంతగానో అలరించాడు. చక్కటి స్కిట్స్, అదిరిపోయే పంచులలో పడి పడి నవ్వేలా చేశాడు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో వెండితెరపై అడుగు పెట్టాడు. ముందు కమెడియన్ పాత్రలు షోషించాడు. నెమ్మదిగా హీరోగా మారిపోయాడు. చక్కటి కథలను ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక బుల్లితెరపై యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ కు యూత్ లో ఓ రేంజిలో క్రేజ్ ఉంది.
అయితే (Sudigali Sudheer) సుధీర్-రష్మి కలిసి కనిపిస్తే చాలు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు. ఇప్పటికే రష్మి కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా, అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. రష్మి-సుధీర్ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేయబోయే మూవీ గురించి సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుధీర్ హీరోగా చేస్తున్న సినిమా ‘కాలింగ్ సహస్ర’. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.
అందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సుడిగాలి సుధీర్ పాల్గొన్నాడు. ‘కాలింగ్ సహస్ర’ సినిమాతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. యాంకర్ రష్మితో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు? అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆ ప్రపోజల్ ఉన్నట్లు వెల్లడించారు. “ గత కొద్ది కాలంగా నేను, రష్మి కలిసి కథలు వింటున్నాం. ఇప్పటి వరకు ఇద్దరికీ కామన్ గా నచ్చిన స్టోరీ దొరకలేదు. ఒకవేళ అలాంటి స్టోరీ ఓకే అయితే కచ్చితంగా ఇద్దరం కలిసి చేస్తామని సుధీర్ అన్నారు.
కాలింగ్ సహస్ర’. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. అయితే ఇప్పుటికి సుధీర్ రెండు సినిమాలు తీశారు. అవి అశించిన స్థాయిలో థియేటర్స్ లో సందడి చేయలేకపోయాయి. ఈ చిత్రమైన అభిమానులను , ప్రేక్షకులను మెప్పించాలని సుధీర్ కెరిర్ లో హిట్ కొట్టాలని కోరుకుందాం.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!