Sudigali Sudheer Marriage: సుడిగాలి సుధీర్ పెళ్ళి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే..?
January 5, 2022 / 03:30 PM IST
|Follow Us
‘జబర్దస్త్’ తో సుధీర్ కు ఎంత క్రేజ్ వచ్చిందో.. అలాగే కాంట్రవర్సీలు కూడా అదే రేంజ్లో తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా యాంకర్ రష్మీ గౌతమ్ తో ఇతను ప్రేమాయణం నడుపుతున్నాడని.. ఆమెనే పెళ్ళి చేసుకోబోతున్నాడని తెగ ప్రచారం జరిగింది. వీళ్ళిద్దరూ ఎన్నో సార్లు ఖండించి.. మేము మంచి స్నేహితులమే అని చెప్పినా.. ఆ వార్తలు ఆగడం లేదు. ఇదే విషయం పై రష్మీ కూడా నెటిజెన్ల పై ఫైర్ అయ్యి అయ్యి అలిసిపోయింది. ఇక సుధీర్ కూడా ఈ వార్తలకు బ్రేక్ వెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో యంగ్ హీరోలు, ఆర్టిస్ట్ లు పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరోలు నిఖిల్ పెళ్ళి చేసేసుకున్నాడు. నితిన్, రానా కూడా పెళ్ళికి రెడీ అవుతున్నారు. మొన్నటికి మొన్న ‘జబర్దస్త్’ మహేష్ కూడా పెళ్ళి చేసుకున్నాడు. అసలే 30 కి 30 రోజులు బిజీగా ఉండే ఆర్టిస్ట్ మన సుధీర్. అతని టైం కొంచెం కూడా ఖాళీ ఉండట్లేదట. దీంతో ఎలాగూ లాక్ డౌన్ వల్ల ఇప్పుడు ఖాళీ దొరికింది కాబట్టి… పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడట.
ఈ విషయంలో అతని స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లు కూడా సుధీర్ కు మంచి మ్యాచ్ కోసం తెగ ట్రై చేశారట. చివరికి ఓ మ్యాచ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అమ్మాయి సుధీర్ కు నచ్చడం ఇక జాతకం స్కోర్ కూడా బాగా మ్యాచ్ అవ్వడంతో.. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడట. ఇక అమ్మాయిది కూడా కృష్ణా జిల్లానే అని తెలుస్తుంది. సుధీర్ కు దగ్గర బంధువుల అమ్మాయి అని తెలుస్తుంది. వీలైనంత తొందరగా ఇతని పెళ్ళి జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.