Rashmi,Sudigali Sudheer: ఎట్టకేలకు రష్మీ పై ఉన్న ప్రేమను బయటపెట్టిన సుధీర్!
June 18, 2022 / 04:23 PM IST
|Follow Us
బుల్లితెర జోడిగా సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.రష్మీ యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా సందడి చేశారు. ఇకపోతే వీరిద్దరు కలిసి ఢీ కార్యక్రమంలో చేసే హంగామా అభిమానులను పెద్దఎత్తున ఆకట్టుకుంది. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈటీవీకి పూర్తిగా దూరం కాగా వీరిద్దరూ కలిసి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నారు. గతంలో జబర్దస్త్ కార్యక్రమం వేదికగా వీరిద్దరూ కలిసి చేసే పనులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో ఏకంగా మల్లెమాలవారు సుధీర్ రష్మికి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో ఎన్నో ఈవెంట్లలో వీరి చేత ఫర్ఫార్మెన్స్ చేయించేవారు. ఇలా ఆన్ స్క్రీన్ ద్వారా ప్రేమికులుగా ఎంతోమందిని సందడి చేయడంతో నిజజీవితంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని భావించారు. ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో సుధీర్ రష్మి స్పందిస్తూ తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో సుధీర్ పూర్తిగా ఈటీవీకి దూరం అయ్యారు.
ఈ విధంగా ఈ టీవీ కి దూరం కావడంతో చాలా మంది అభిమానులు సుధీర్ రష్మీ జోడిని మిస్ అవుతున్నారు.ప్రస్తుతం సుడిగాలి సుదీర్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న దిల్ సే కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుధీర్ రష్మీ పై ఉన్న ప్రేమను బయటపెట్టారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా సుడిగాలి సుదీర్ అభిమానులు వేదిక పైకి వచ్చారు.
వీరిలో 7 సంవత్సరాల కుర్రాడు వేదికపైకి వచ్చి సుధీర్ ను బాబాయ్ అంటూ సంబోధించాడు. సుదీర్ ను బాబాయ్ అని పిలుస్తూనే రష్మీ పిన్ని ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుదీర్ ఎమోషనల్ అవుతూ తను నా గుండెల్లోనే ఉంది అంటూ రష్మీ పై ఉన్న ప్రేమని బయటపెట్టారు. ఇలా సుధీర్ రష్మీ పై ఉన్న ప్రేమను బయటపెట్టడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.