Suhas Interview: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ గురించి సుహాస్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • January 30, 2024 / 08:02 PM IST

సుహాస్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది.దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్’ ‘మహాయాన మోషన్ పిక్చర్స్’ సంస్థల పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘బన్నీ వాస్’ ‘వెంకటేష్ మహా’ సమర్పకులుగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి మీకోసం :

ప్ర) ముందుగా మీకు కంగ్రాట్స్..! ప్రాణ ప్రతిష్ట రోజు మీకు బాబు పుట్టాడు.. ఎలా అనిపిస్తుంది?

సుహాస్ : థాంక్యూ.. ఈ మధ్యే బాబు పుట్టాడు. ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంటున్న రోజున బాబు పుట్టడం ఆనందంగా అనిపించింది. మంచి జరుగుతుందనే అనిపిస్తుంది.

ప్ర) ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా కోసం మీరు స్పెషల్ గా చేసిన హోమ్ వర్క్ లాంటిది ఏమైనా ఉందా?

సుహాస్ : స్క్రిప్ట్ మీద ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యాం.హోమ్ వర్క్.. అంటే బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. చూసేవాళ్ళు.. నేను బ్యాండ్ కొడుతున్నప్పుడు యాక్ట్ చేస్తున్నాను అనుకోకూడదు. నిజంగా బ్యాండ్ కొడుతున్నాను అనుకోవాలి అని..!

ప్ర) ముఖ్యంగా ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు. మీ నెక్స్ట్ సినిమాలకి ఇబ్బంది కలుగుతుంది అని భయం కలగలేదా?

సుహాస్ : రెండు సార్లు గుండు గీయించుకున్నా. 2 ఏళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నా.. ఈ కథ పై ఉన్న నమ్మకం వల్ల అది రిస్క్ అనిపించలేదు.

ప్ర) ఫిబ్రవరి నెల అనేది సినిమాలకి కొంచెం అన్ సీజన్ లాంటిది అని అంటారు?

సుహాస్ : గత ఏడాది ఫిబ్రవరిలోనే మా ‘రైటర్ పద్మభూషణ్’ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.అలాంటి భయాలు ఏమీ లేవు. ఈ ఫిబ్రవరికి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్ముతున్నాం.

ప్ర) ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ కోసం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా షూటింగ్ చేశారు.. ఎలా అనిపించింది?

సుహాస్ : అమలాపురం, అంబాజీపేటలో షూటింగ్ చేశాం. నాకు అక్కడి వాతావరణం, స్లాంగ్ బాగా తెలుసు. ఎక్కువగా నేను అక్కడికి ఎక్కువగా వెళ్ళొస్తా ఉండేవాడిని. ఆ ఏరియాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. టైమ్ దొరికితే ఫ్రెండ్స్ తో అక్కడి ఏరియాలకు వెళ్తుంటాను.

ప్ర) దుష్యంత్ ఈ కథ వినిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది?

సుహాస్ : దుష్యంత్ రాసిన కథ నన్ను బాగా కదిలించింది. అప్పుడు లాక్ డౌన్ టైమ్ కాబట్టి చాలాసార్లు స్క్రిప్ట్ చదువుకుని ఏ పాయింట్స్ బాగున్నాయో డిస్కస్ చేసేవాళ్లం.

ప్ర) ట్రైలర్ చూస్తుంటే ‘కలర్ ఫోటో’ కి ఈ సినిమాకి సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి.?

సుహాస్ : మా (Suhas) నాన్న కూడా ఇలాగే అన్నారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మీకు అలా అనిపించదు. ఇందులో కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది 2007 లో జరిగే కథ. దర్శకుడు దుష్యంత్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు.

ప్ర) హీరోయిన్ శివానీ గురించి చెప్పండి?

సుహాస్ : ఈ సినిమా శివానికి మంచి గుర్తింపుని తీసుకొస్తుంది. ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. శివాని డాన్సర్, సింగర్ కూడా.

ప్ర) నిర్మాత ధీరజ్ మొగిలినేని గురించి చెప్పండి?

సుహాస్ : అన్న చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. కొత్త డైరెక్టర్ అయినా ఏది కావాలంటే అది క్షణాల్లో అందుబాటులోకి తెచ్చేవారు. అవుట్ డోర్ షూటింగ్లో మాపై చూపించిన కేరింగ్ అంతా ఇంతా కాదు. ఆయన దగ్గర చాలా ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఏదైనా ఓపెన్ గా చెప్పగలం.

ప్ర) హీరోగానే ఎక్కువగా కంటిన్యూ అవుతారా.. లేక ‘హిట్ 2’ లో మాదిరి విలన్ రోల్స్ కూడా చేస్తారా?

సుహాస్ : ‘హిట్ 2’ తర్వాత ఎక్కువగా అలాంటి రోల్స్ వస్తున్నాయి. అందుకే దేనికీ ఓకే చెప్పలేదు. కానీ నచ్చితే ఎలాంటి పాత్రలు అయినా చేస్తాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

సుహాస్ : ‘కలర్ ఫోటో’ సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ చెప్పాడు. నెక్ట్ లెవెల్లో ఉంది. ఆ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సుకుమార్ గారి అసోసియేట్ తో ‘ప్రసన్నవదనం’ అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. ‘కేబుల్ రెడ్డి’ అనే మరో మూవీ కూడా చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో ‘సలార్’ రైటర్ తో ఒక మూవీ చిత్రీకరణ జరుగుతుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus