టీవీల్లో చూపించని చాలా విషయాలను హాట్‌స్టార్‌లో చూపిస్తుంటాడు బిగ్‌బాస్. రోజంతా జరిగే విషయాలను టీవీల్లో చూపించకుండా కొన్ని ఆన్లైన్ వదులుతుంటాడు. ఇంట్లో జరిగిన చర్చ, సరదా, కోపాలు, కష్టాలు ఇలా చాలా అందులో ఉంటాయి. బిగ్‌బాస్ 4లోనూ అదే చేస్తున్నారు. లగ్జరీ బడ్జెట్ సెలక్ట్ చేసుకునే విషయంలో చిన్నగా మొదైలన చర్చ సూర్యకిరణ్, సుజాత మధ్య మాటమాటకు దారి తీసింది. ఇంతకీ ఏమైందంటే? లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, సూర్యకిరణ్, సుజాత మధ్య మొదలైన చర్చ ఆఖరికి సుజాత కోపానికి, ఆగ్రహానికి కారణమైంది.
మొదట్నుంచి ఇంట్లోవాళ్ల మీద సూర్యకిరణ్ తన ఆలోచనల్ని రుద్దాలని చూస్తున్నాడు. ఇక్కడ లగ్జరీ బడ్జెట్ విషయంలో అదే ప్రయత్నం చేశాడు. అక్కడ అసలు చర్చ ఘాటెక్కింది. అనవసరమైన ఫుడ్ కోసం ఆలోచించకుండా… గోధుమలు లాంటి వాటిని ఎక్కువగా ఆర్డర్ పెడదామని సూర్యకిరణ్ అన్నారు. దానికి సుజాత ‘అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం’ అని చెప్పింది. అయితే అలా అందరికీ అడగడానికి సూర్యకిరణ్ అంగీకరించలేదు. వంట చేసేవాళ్లే నిర్ణయం తీసుకుంటారు అని తెగేసి చెప్పాడు.
దీంతో సుజాతకు కోపం వచ్చింది. ప్రతి సారి ‘నన్నిలా జడ్జ్ చేయొద్దు’ అని చెప్పింది. ‘నేనేం మాట్లాడినా మీరు అడ్డొస్తున్నారు’ అంటూ సుజాత తేల్చింది. పక్కన ఉన్న అమ్మ రాజశేఖర్ కూడా సూర్యకిరణ్‌కు సపోర్టు చేశారు. ఆఖరికి ‘నీ ఇష్టం’ అంటూ సూర్యకిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని ప్రభావం ఎలా ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్లో చూడాలి.