Sujitha, Surya Kiran: సూర్యకిరణ్ మృతిపై సుజిత ఎమోషనల్.. అన్నయ్య మాత్రమే కాదంటూ?
March 16, 2024 / 09:11 AM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియళ్ల ద్వారా సుజిత (Sujitha) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సుజిత సోదరుడు సూర్యకిరణ్ (Surya Kiran) టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకునిగా గుర్తింపును సొంతం చేసుకోగా వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల సూర్యకిరణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. సూర్యకిరణ్ మరణం ఆయన కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెట్టింది. సూర్యకిరణ్ మృతి పట్ల సుజిత ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు. అన్నయ్య.. నీ మరణవార్త గుండెలు పగిలేలా చేసిందని నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని సుజిత పేర్కొన్నారు.
నువ్వు నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు నా తండ్రితో సమానం అని సుజిత చెప్పుకొచ్చారు. నా హీరో కూడా నువ్వేనని ఆమె పేర్కొన్నారు. నీ మాటలకు, నీ ప్రతిభకు నేను ఎప్పుడూ గౌరవం ఇస్తూనే ఉంటానని సుజిత కామెంట్లు చేశారు. మరో జన్మ ఉంటే నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. సుజిత చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా సూర్యకిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సూర్యకిరణ్ తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ సుజిత ఎమోషనల్ పోస్ట్ చేశారు. సుజితకు దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని సోదరుడి మరణవార్త నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన దర్శకుడు సూర్యకిరణ్ తుదిశ్వాస విడిచారు. 200కు పైగా సినిమాలలో సూర్యకిరణ్ బాల నటుడిగా, సహాయ నటుడిగా నటించి మెప్పించారు.
బిగ్ బాస్ సీజన్4 తెలుగు కంటెస్టెంట్ గా సూర్య కిరణ్ గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగా ఒక సినిమా వల్ల సూర్యకిరణ్ ఆర్థికంగా నష్టపోయారు. ఆ సినిమా వల్ల సూర్యకిరణ్ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. సూర్యకిరణ్ హఠాన్మరణం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది.