టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూనే.. మరోపక్క సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా సుకుమార్ మైత్రి మూవీస్ తో కలిసి ‘ఉప్పెన’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాతో తన శిష్యుడు బుచ్చిబాబు సానాని దర్శకుడిగా పరిచయం చేశాడు సుకుమార్. అయితే ఈ సినిమాకి ఆర్థికంగా సుకుమార్ ఎలాంటి సాయం అందించలేదు. సినిమాపై పెట్టుబడి మొత్తం మైత్రి సంస్థ నిర్మాతలే పెట్టుకున్నారు.
కానీ సుకుమార్ పర్యవేక్షణలో ఈ సినిమాను తెరకెక్కించడంతో సినిమాకి వచ్చిన లాభాల్లో యాభై శాతం తనకు వచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఈ సినిమాపై సుక్కు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని కొన్ని సన్నివేశాల్లో మార్పులు, చేర్పులు కూడా చేశారు. సినిమా థియేటర్లోకి వచ్చే వరకు సుకుమార్ ఎంతో కేర్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. లాంగ్ రన్ లో సినిమా రూ.50 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.
సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మంచి డీల్ కుదిరింది. ఈ సినిమాతో నిర్మాతలకు ఎలా లేదన్నా.. రూ.40 కోట్లు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందులో సగం మొత్తం అంటే రూ.20 కోట్లు సుకుమార్ కి దక్కనున్నాయి. ఇరవై కోట్లు అంటే చిన్న విషయం కాదు.. సుకుమార్ ఒక సినిమాను డైరెక్ట్ చేయడానికి ఇంత మొత్తం తీసుకుంటారు. అలాంటిది దర్శకత్వ పర్యవేక్షణ చేసి ఈ రేంజ్ లో లాభాలు ఆర్జించారు. ఈ సినిమా తీసుకొచ్చిన లాభాలతో నిర్మాతలు.. దర్శకుడు, హీరో, హీరోయిన్లకు విలువైన బహుమతులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!