మే 24 న ‘సుల్తాన్’ ట్రైలర్.. !

  • May 23, 2016 / 08:54 AM IST

హర్యానాకు చెందిన రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సుల్తాన్’. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సుల్తాన్ అలీ ఖాన్ పాత్రలో నటిస్తుండగా.. ఆర్ఫా పాత్రలో, సల్మాన్ కు జంటగా  అనుష్క శర్మ నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. ఈ చిత్ర ట్రైలర్ ను మే 24 రాత్రి 7:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు తెలిపారు.

ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ ట్రైలర్ పై సల్మాన్ అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.  అలీ అబ్బాస్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈద్ కానుకగా విడుదల అవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus