‘సుమలత’ బయటపెట్టిన ‘సినిమా’ నిజాలు!!!

  • March 12, 2016 / 09:34 AM IST

సినీ పరిశ్రమలోని పాప్యులర్ పర్సనాలిటీస్ ను స్క్రీన్ ముందు ఉంచి, వారి అనుభవాలను, ప్రజలకు అందించే ఓపెన్ హార్ట్ కార్యక్రమం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఎందరో తారలు మన అనుభవాలను మనసు విప్పి చెప్పగా, తాజాగా ఆ కార్యక్రమానికి వచ్చిన అలనాటి అందాల భామ సుమలత అంబరీష్, అప్పట్లో తన అనుభవాలను, తనపై వచ్చిన రూమర్స్ ను బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ…తన ఎత్తుపై టాప్ హీరోలు ఎంతో మంది కొమెంట్స్ చేసేవారు అని..’తాను వైజయంతీ మాల, హేమమాలిని, రేఖ లాంటి అందమైన హీరోయిన్స్ రేంజ్ కి సరిపడేదాన్ని అని అంటూ, తమతో నటించేటప్పుడు చెప్పులు తీసేయ్యమంటూ ఎందరో హీరోలు తనకు చెప్పి కోపం తెప్పించేవారు అని, ఇంక కోపంలో….ఏం చెయ్యమంటారు…కాళ్లు నరుక్కోమంటారా ? అని టాప్ హీరోల పై సెటైర్లు వేసేదాన్ని అని ఆనాటి విషయాలను గుర్తుకు చేసుకుంది సుమలత. ఇక తనకు ఇష్టమైన హీరో కమల్ హసన్ తో నటించే అవకాశం దక్కకపోవడం బాధ కలిగించిన విషయం అంటూ తెలిపింది. తాను నటించిన చాలామంది హీరోలు తమను పెళ్ళి చేసుకోమని ప్రపోజ్ చేసారు అంటూ చెబుతూనే, తన పెళ్లి విషయంలో మోహన్ బాబుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది.

ఈమధ్య మోహన్‌బాబు ఒక విషయమై తన పై కోపం వచ్చి తన భర్త అంబరీష్ తో మాట్లాడుతూ ‘నువ్వు మినిష్టర్ అని ఊరుకున్నాను. లేకుంటే నీ భార్యను చంపేసేవాడిని’ అని సరదాగా సెటైర్లు వేశాడని తనకు, మోహన్ బాబుకు మధ్య ఉన్న స్నేహ బంధాన్ని వివరించింది. ఇక పెళ్లి సమయంలో తాను అంబరీష్ ను చేసుకుంటున్నా అని చెప్పగానే…‘నీకేమయినా పిచ్చా’ అంటూ సుహాసిని తన పై జోక్స్ వేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది సుమలత. ఇలా తన అనుభవాలను, ఆనందాలను ఆర్కె తో పంచుకుంది సుమలత.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus