Movies: సమ్మర్ స్పెషల్‌గా మారాలంటే.. ఈ నెల ఇంకా హిట్లు కావాలి.. ఏమవుతుందో?
May 2, 2023 / 06:51 PM IST
|Follow Us
టాలీవుడ్‌కి సంక్రాంతి ఎంత పెద్ద సీజనో మీకు తెలిసిందే. సుమారు రెండున్నర నెలల సీజన్ ఇది. దీంతో పెద్ద హీరోలు ఈ సీజన్‌ను టార్గెట్ చేస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా అగ్ర హీరోలు రెడీ అయ్యారు. అయితే వివిధ కారణాల వల్ల ఏ సినిమా కూడా ముందుకురాలేదు. దీంతో కుర్ర స్టార్లు, చిన్న సినిమాలు వరుసకడుతున్నాయి. అలా ఏప్రిల్‌లో వచ్చిన సినిమాల్లో విజయాల శాతం తక్కువగానే నమోదైంది. రెండు సినిమాలు బాగున్నాయి. దీంతో సమ్మర్లో కీలకమైన రెండో నెల పరిస్థితి ఏంటి అనేది చర్చగా మారింది.
ఏప్రిల్‌లో వచ్చిన (Movies) సినిమాల్లో సమంత ‘శాకుంతలం’, రవితేజ ‘రావణాసుర’ భారీ అంచనాలతో వచ్చి తుస్ మనిపించాయి. దీంతో ఏప్రిల్‌లో అన్ని వారాలు విజయాలు సాధించి మంచి వసూళ్లు సాదిద్ధాం అనుకున్న టాలీవుడ్‌కి నిరాశే ఎదురైంది. దీంతో సమ్మర్లో ప్రతి వారం ఒక మంచి సినిమా పడాలని ఆశిస్తున్నారు సినిమా ఫ్యాన్స్. అలా ఈ నెల మొదటి వారంలో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. గోపీచంద్ – శ్రీవాస్ ‘రామబాణం’ ఒకటైతే.. రెండోది నరేశ్ – విజయ్ కనకమేడల ‘ఉగ్రం’ వస్తున్నాయి.
‘రామబాణం’తో గోపీచంద్ – శ్రీవాస్ హ్యాట్రిక్ కోసం చూస్తుండగా.. ‘ఉగ్రం’తో నరేశ్ – విజయ్ డబుల్ హిట్ కూడా చూస్తున్నారు. రెండో వారంలో నాగాచైతన్య – వెంకట్ ప్రభు ‘కస్టడీ’ని తీసుకొస్తున్నారు. మరి ఈ ద్విభాషా చిత్రం చైతన్యకు ఎంత వరకు విజయం అందిస్తుందో చూడాలి. ఇక మూడో వారంలో శ్రీవిష్ణు ‘సామజవరగమణ’, సంతోష్ శోభన్ ‘అన్నీ మంచి శకునములే’ వస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలకు విజయం చాలా అవసరం. ఆ తర్వాత రోజు అంటే 19న విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ తీసుకొస్తున్నారు.
ఆఖరి వారంలో అనుష్క – నవీన్ పొలిశెట్టిల ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వస్తుంది. అదే వారంలో సిద్ధార్థ్ ‘టక్కర్’ కూడా తీసుకొస్తున్నారు. ఇలా ప్రతి వారంలో కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. విజయాల సంగతే చూడాలి. అన్నట్లు ఈ సినిమాలే కాదు ‘మ్యూజిక్ స్కూల్’, ‘భువన విజయం’, ‘ఫర్హానా’ మే 12న వస్తుండగా, ‘మెన్ టూ’, ‘రుద్రంగి’ మే 26న తీసుకొస్తున్నారు.