టాలీవుడ్ లో మరో విషాదం: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుందరం మాస్టారు!
March 22, 2022 / 10:49 PM IST
|Follow Us
సినిమా ప్రపంచం లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు తుది శ్వాస విడిచారు. ఒక్కసారిగా సినీ లోకాన్ని అలాగే నాటక రంగాన్ని ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. నాటక రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ సుందరం మాస్టారు గతంలోనే కొంత అనారోగ్యంతో నాటక రంగానికి కాస్త దూరమయ్యారు. ఇక మెల్లగా కోలుకుంటున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
1950 అక్టోబరు 29న ఒంగోలులో జన్మించిన సుందరం మాస్టారు బీఎస్సీ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగ స్థల కళల విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ కు వచ్చేశారు. నాలుగేళ్ల క్రితమే ఆయన భార్య శిరీష కూడా మరణించారు. ఇక తెలుగు నాటక రంగంలో రంగస్థల నటులుగా దర్శకుడిగా ఎనలేని కీర్తిని అందుకున్న సుందరం మాస్టారు నవలా రచయితగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తల్లావఝ్జల సుందరం మాస్టారు సంపాదించుకుంమరు. 71 ఏళ్ల వయసులో ఉన్న సుందరం మాస్టరుకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సన్నిహితులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు వివరణ ఇచ్చారు.
నాటక రంగంలో సుందరం మాస్టారు ఎక్కువగా నవ్వులు పూయించే విధంగా అద్దిన రచనలు ఛలోక్తులులతో ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేశాయి. సోమవారం సుందరం మసారుకు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన చిక్కడపల్లిలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారని చెప్పారు. ఇక సుందరం మాస్టారు సోమవారం ఉదయమే కాస్త ఛాతీలో నొప్పిగా ఉందని తన మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్ చేసి చెప్పినట్లు వివరణ ఇచ్చారు. అనంతరం విషయం తెలుసుకున్న శిష్యులు సుందరం మస్తారును ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించాగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
దాదాపు సుందరం మాస్టారు రెండు వందలకుపైగా నాటకాల్లో నటించారు. సుందరం మాస్టారు హఠాత్తుగా కన్నుమూయడంతో పలువురు రంగస్థల ప్రముఖులు నివాళులర్పించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఘటన విషయాన్ని తెలుసుకొని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సుందరం మాస్టారు కుమారుడు, కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఇక వారు రాగానే ఈనెల 23న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సుందరం మాస్టారు అంత్యక్రియలు జరగనున్నాయి.